రాష్ట్రీయం

రేపు నింగిలోకి ఎటివి రాకెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, ఆగస్టు 26: నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ (షార్) నుండి ఆదివారం అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ లాంచింగ్ వెహికల్ (ఎటివి) రాకెట్ ప్రయోగం జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. శ్రీహరికోటలోని సౌండింగ్ రాకెట్ ప్రయోగ వేదిక నుండి ఈ రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు. దీనికి సంబంధించిన కౌంట్‌డౌన్ శనివారం సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభం కానుంది. నిరాటంకంగా 13 గంటల 15 నిముషాల పాటు కౌంట్‌డౌన్ కొనసాగిన అనంతరం రాకెట్ నింగిలోకి ఎగరనుంది.
భూ వాతావరణంలోని సహజసిద్ధ వాయువును ఇంధనంగా వినియోగించే టెక్నాలజీని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) అభివృద్ధి పరిచే రీతిలో ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. దీని వల్ల రాకెట్ బరువు తగ్గడమే కాకుండా కచ్చితత్వాన్ని మరింత పెంచే వీలుంటుంది. ఆదివారం ఉదయం 7.45గంటలకు షార్‌లోని సౌండింగ్ రాకెట్ ప్రయోగ వేదిక నుండి ఎటివి నింగిలోకి ఎగరనుంది. భూమి నుండి 600కి.మీ ఎత్తులోకి పంపించి మళ్లీ తిరిగి దిగే విధంగా దీన్ని రూపొందించారు. దీని వల్ల భవిష్యత్‌లో భారీ ప్రయోగాలను చేపట్టేందుకు వీలుంటుంది.
సెప్టెంబర్ 8న జిఎస్‌ఎల్‌వి ప్రయోగం
సెప్టెంబరు 8న జిఎస్‌ఎల్‌వి-ఎఫ్ 05 రాకెట్‌ను షార్‌లోని రెండో ప్రయోగ వేదిక నుండి నింగిలోకి పంపనున్నారు. ఈ రాకెట్ ద్వారా 2220 కిలోల బరువు గల ఇన్‌శాట్-3డి ఆర్ ఉపగ్రహాన్ని రోదసీలోకి పంపనున్నారు. ఇప్పటికే రాకెట్ మూడు దశల అనుసంధాన పనులను శాస్తవ్రేత్తలు పూర్తిచేసి రాకెట్ చివరి భాగంలో ఉపగ్రహాన్ని అమర్చనున్నారు. ఇస్రో వర్గాల సమాచారం మేరకు 8న సాయంత్రం 4.52గంటలకు రాకెట్ నింగిలోకి ఎగరనుంది. సెప్టెంబరు 28న మొదటి ప్రయోగ వేదిక నుండి పిఎస్‌ఎల్‌వి-సి 35 రాకెట్ ప్రయోగం జరిపేందుకు ఇస్రో సన్నాహం చేస్తోంది. ఈ రాకెట్ ద్వారా మన దేశానికి చెందిన స్కైశాట్ ఉపగ్రహంతో విద్యార్థులు రూపొందించిన మరో రెండు ఉపగ్రహాలు, విదేశాలకు చెందిన 5 చిన్న ఉపగ్రహాలను ఒకేసారి కక్ష్యలోకి పంపనున్నారు. దీనికి సంబంధించిన పనులు ఈ నెల 22న ప్రారంభమై శరవేగంగా జరుగుతున్నాయి. నెల రోజుల వ్యవధిలో శ్రీహరికోట నుండి మూడు ప్రయోగాలు ఉండటంతో షార్‌లో సందడి వాతావరణం నెలకొంది.
ప్రయోగానికి సిద్ధమవుతున్న జిఎస్‌ఎల్‌వి రాకెట్
ఏమి చేస్తున్నారు?