రాష్ట్రీయం

మెడ తెగినా..మడమ తిప్పను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నా మెడ తెగిపడినా సరే.. మడమతిప్పేది లేదు.. వెనుకడుగేసేది లేదు.. నేను ఇప్పుడు పంచ్ డైలాగులు కొట్టటం లేదు. నా హృదయంలోంచి పెల్లుబికి వచ్చిన మాటలివి’ అంటూ జనసేనాధిపతి, పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ అకస్మాత్తుగా అజ్ఞాతం వీడి శనివారం తిరుపతిలో సభపెట్టి ఉద్వేగంతో, ఆవేశంతో ప్రసంగించారు. దేశంలో, రాష్ట్రంలో అన్ని పార్టీలపైనా తనదైన స్టైల్‌లో విరుచుకుపడ్డారు. తనకు కులం అంటగడితే చిర్రెక్కుతుందన్నారు. తాను రబ్బర్‌సింగ్ కాదని, పవన్‌సింగ్ అని చెప్పుకొచ్చారు. తన పార్టీ జనం భజన చేసే పార్టీ అన్నారు. ప్రధాని మోదీపైనా, చంద్రబాబుపైనా, కాంగ్రెస్, వామపక్షాలపైనా విమర్శనాస్త్రాలు సంధించారు. అదే సమయంలో సీమాంధ్ర ఎంపీల పౌరుషాన్నీ ప్రశ్నించారు. కేంద్ర మంత్రుల్ని రాజీనామా చేయమన్నారు. సీబీఐ కేసులు పెడతారని భయపడుతున్నారా అనీ నిలదీశారు. ఇన్నాళ్లూ ఊరుకున్నాను.. ఇక సహించేది లేదని హెచ్చరించారు.

చిత్రం.. తిరుపతి ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన సభలో మాట్లాడుతున్న జనసేనాని పవన్‌కళ్యాణ్