రాష్ట్రీయం

‘మహా’ ఒప్పందంపై అసెంబ్లీలో చర్చ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 27: గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణానికి మహారాష్ట్ర-తెలంగాణ మధ్య కుదిరిన ఒప్పందంపై అసెంబ్లీలో చర్చించాలని అధికారపక్షం భావిస్తోంది. జిఎస్‌టి బిల్లుపై ఆమోదం కోసం ఈనెల 30 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. శీతాకాల సమావేశాలను కనీసం మూడు రోజుల పాటు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలిరోజు సమావేశం తరువాత విపక్షాల డిమాండ్ మేరకు మరిన్ని రోజులు పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. 30న జిఎస్‌టి బిల్లు ఆమోదంపైనా, 31న కొత్త జిల్లాల ఏర్పాటుపైనా సమావేశంలో చర్చిస్తారు. ఇప్పటికే ముసాయిదా నోటిఫికేషన్ విడుదలైనందున ఆయా జిల్లాల శాసనసభ్యులు కొత్త జిల్లాల ఏర్పాటుపై శాసనసభలోనే తమ అభిప్రాయాలను వెల్లడిస్తారు. ఒకటవ తేదీన మహారాష్ట్ర తెలంగాణ ఒప్పందాలపై చర్చ జరుపుతారు. మహారాష్ట్ర ఒప్పందాలు, ప్రాజెక్టుల నిర్మాణం తదితర అంశాలపై శాసనసభలో సుదీర్ఘ చర్చ జరగాలని కోరుకుంటున్నట్టు అధికారపక్షం చెబుతోంది. ప్రాణహిత ప్రాజెక్టుపై మహారాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 16 లేఖలు రాసిందనీ, ఆంధ్రప్రదేశ్ నుంచి స్పంద లేకపోవడంతో మహారాష్ట్ర కేంద్రానికి లేఖ రాసిందనీ, వీటిన్నింటినీ అసెంబ్లీలో వివరిస్తామనీ మంత్రులు తెలిపారు.