రాష్ట్రీయం

‘హన్మకొండ’ వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 27: కొత్త జిల్లాల ఏర్పాటుకు అధికారపక్షంనుంచే అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. హన్మకొండ జిల్లా ఏర్పాటుపై ఇప్పటివరకూ ప్రతిపక్షాలనుంచే వ్యతిరేకత వ్యక్తమవుతుండగా, తాజాగా టిఆర్‌ఎస్ శ్రేణులు కూడా వారితో గొంతు కలిపాయి. ట్రై సిటీగా కలిసి ఉన్న వరంగల్, హన్మకొండ, కాజీపేట పట్టణాలను విడదీసి హన్మకొండ జిల్లాగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను స్వయంగా టిఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు వ్యతిరేకించారు. ఈ మేరకు హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను విరమించుకోవాలంటూ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ నన్నపనేని నరేందర్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, నగరానికి చెందిన అధికార పార్టీ ముఖ్యనేతలు ప్రభుత్వాన్ని కోరారు. శనివారంనాడు వారు విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. పరిపాలనా సౌలభ్యంకోసం సిఎం కొత్త జిల్లాల ఏర్పాటు నిర్ణయం తీసుకున్నారని ఒకవైపు పొగడ్తలతో ముంచెత్తుతూనే, మరోవైపు హన్మకొండ జిల్లా ఏర్పాటు తగదన్నారు. హన్మకొండ జిల్లాపై ప్రజలు, ప్రజాసంఘాల నుండి నిరసనలు వ్యక్తమవుతున్నాయని, దీనిపై పునరాలోచించాలని కోరుతూ త్వరలో కెసిఆర్‌ను కలిసి వినతిపత్రం అందచేసి, ఒప్పిస్తామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు. హన్మకొండ జిల్లా ఏర్పాటు ప్రతిపాదనను కేవలం నోటిఫికేషన్‌లో మాత్రమే పొందుపరిచారని, అప్పుడే తాము ఈ విషయాన్ని సిఎం దృష్టికి తీసుకెళ్లామని, అయితే ఇది కేవలం డ్రాఫ్టు మాత్రమేనని, ప్రజల నుండి వ్యతిరేకత వచ్చినట్లైతే, మార్చుకుందామని స్వయంగా తమకు కెసిఆర్ హామీ ఇచ్చారని వారు చెప్పారు. ఈవిషయంపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేయడం సరికాదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం జిల్లా బంద్‌కు పిలుపివ్వని కాంగ్రెస్ నాయకులు ఈనెల 30న బంద్‌కు పిలుపుఇవ్వడాన్ని వారు తప్పుబట్టారు.కాగా జనగామ నియోజకవర్గ ప్రజలు, అక్కడి ప్రజాప్రతినిధులు జనగామ జిల్లాను బలంగా కోరుకుంటున్నారని, ప్రజాభిప్రాయాలకు అనుగుణంగా జనగామ జిల్లా ఏర్పాటు చేయాలని వరంగల్ పార్లమెంటు సభ్యుడు పసునూరి దయాకర్ తన వ్యక్తిగత అభిప్రాయంగా సిఎంను కోరారు.

చిత్రం.. వరంగల్ టిఆర్‌ఎస్ కార్యాలయంలో శనివారం విలేఖరులతో మాట్లాడుతున్న మేయర్, ఎంపి, ఎమ్మెల్యేలు