రాష్ట్రీయం

గోవాలోనే నదీం హతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ వికారాబాద్, ఆగస్టు 27: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసులో సిట్ అధికారులు చేపట్టిన విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. పోలీసు కస్టడీలో నరుూం అనుచరురాలు ఫర్హానా సంచలన విషయాలు బయటపెట్టింది. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన తాను తన భర్త చనిపోవడంతో నరుూం ఇంట్లో వంట మనిషిగా చేరానని, నరుూం వేధింపులు, అరాచకాలు భరించలేకపోయానని చెప్పింది. పిల్లల ఎదుటే లైంగిక దాడులకు పాల్పడేవాడని, తన పిల్లలు మాట వినడంలేదని పచ్చిమిర్చి రసం తాగించేవాడని ఆమె చెప్పినట్టు సిట్ పేర్కొంది. నరుూం కొట్టిన దెబ్బలకు తన పిల్లలు నడువలేని స్థితిలో ఉన్నారని ఆమె విచారణలో పేర్కొన్నట్టు సిట్ అధికారి ఒకరు తెలిపారు. నరుూం నెలలో 20 రోజులపాటు గోవా బీచ్‌లోని ఇంట్లో ఎంజాయ్ చేసేవాడని, గోవా వెళ్లేటప్పుడు అమ్మాయిలను వెంట తీసుకెళ్ళేవాడని ఫర్హానా ఇంటరాగేషన్‌లో తెలిపింది. గోవాలోనే నదీంను కిరాతకంగా హత్య చేశాడని, ఆయన చేసిన హత్యలకు తానే ప్రత్యక్ష సాక్షినని ఫర్హానా సిట్ అధికారుల విచారణలో పేర్కొంది. గోవా, అనంతపురం, ఒంగోలు, రాయ్‌చూర్, చత్తీస్‌గఢ్‌లలో ఫ్లాట్లు, ప్లాట్లు, భూములు ఉన్నాయని, తరచూ తనను అక్కడికి తీసుకెళ్లేవాడని ఫర్హానా పేర్కొన్నట్టు తెలుస్తోంది. నరుూం అరాచకాలను అతని అమ్మ, అత్త, సోదరి ప్రోత్సహించేవారని, వీళ్ల ఎదుటే నరుూం అరాచకాలకు పాల్పడేవాడని, షాద్‌నగర్‌లోని వీరి ఇంట్లోనే నస్రీన్‌ను హత్య చేశారని విచారణలో తేలింది. ఏడాది క్రితం నరుూం వేధింపులకు తాళలేక ఫమి, సమి అనే యువతులు కనిపించకుండాపోయారని వారేమయ్యారో తనకు తెలియదని ఫర్హానా పేర్కొన్నట్టు తెలిసింది.
పోలీసులపై తొలి వేటు
గ్యాంగ్‌స్టర్ నరుూం అక్రమ వ్యవహారాల కేసులో ఇద్దరు పోలీస్ అధికారులపై తొలివేటు పడింది. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సిఐ ఉపేంద్ర, చెంగోముల్ ఎస్‌ఐ శేఖర్‌లు శనివారం సస్పెండ్ అయ్యారు. నరుూం బాధితులు ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్‌కు వస్తే బాధితులను వేధించారనే ఆరోపణలతో వారిని సిట్ ఐజి నాగిరెడ్డి సస్పెండ్ చేశారు. నరుూం కేసులో ఇప్పటి వరకు సిట్ అధికారులు 40 మందిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో నరుూం బాధితులు ఎవరు ఫిర్యాదు చేసినా తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికారులకు సిట్ ఐజి నాగిరెడ్డి సూచించారు. ఈ మేరకు సిట్ కార్యాలయంలో కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశామని, బాధితులు ఎవరైనా నేరుగా కాల్‌సెంటర్‌కు ఫిర్యాదు చేయవచ్చని ఐజి తెలిపారు.
సస్పెన్షన్ నరుూం కేసులో కాదు: ఎస్పీ
సిఐ ఉపేందర్, ఎస్‌ఐ శేఖర్‌లను సస్పెండ్ చేస్తూ ఐజి శనివారం ఉత్తర్వులు జారీ చేశారని రంగారెడ్డి జిల్లా ఎస్పీ నవీన్‌కుమార్ వెల్లడించారు. అయితే ఈ సస్పెన్షన్ నరుూం కేసులో కాదని ఆయన మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. చన్గొముల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ కేసుకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదులో ఆలస్యం చేయడమే కాకుండా, తప్పుగా విచారణ చేశారని తెలిపారు.నరుూం కేసుకు సంబంధించి కేసులేమైనా ఉన్నాయేమోననే కోణంలో విచారణ చేశామని ఎలాంటి కేసులు లేవని తేలిందని ఎస్పీ చెప్పారు. రంగారెడ్డి జిల్లాలో నరుూం కేసులన్నీ సైబరాబాద్ పరిధికి సంబంధించినవేనని పేర్కొన్నారు. పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో నరుూం కేసులేమీ లేవని చెప్పారు.
సిఐ రాసలీలలపై కొనసాగుతున్న విచారణ
ఆరోపణలు వచ్చిన పోలీసు అధికారులపై విచారణ చేపట్టడం సహజమని, రాసలీలల సిఐపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు విచారిస్తున్నారని, అయితే సదరు సిఐ ఎవరనేది ఇంకా తేలలేదని ఎస్పీ పేర్కొన్నారు.