రాష్ట్రీయం

సచివాలయానికి మరో 2 శాఖలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 28: ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి మరో రెండు ప్రభుత్వ శాఖలు తరలివచ్చాయి. జల వనరుల శాఖ, ఎక్సైజ్ శాఖ కార్యాలయాలు ఆదివారంనాడు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. జల వనరుల శాఖ కార్యాలయాన్ని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రారంభించారు. ఆయన ఉదయం 8.52 గంటలకు నాలుగో బ్లాక్ మొదటి అంతస్తులోని తన ఛాంబర్‌లోకి ప్రవేశించారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జల వనరుల శాఖ అధికారులు, రాష్ట్ర అపెక్స్ కమిటీ సభ్యులు, ప్రాజెక్టు కమిటీ చైర్మన్లు మంత్రిని సత్కరించి అభినందనలు తెలిపారు. కాగా మూడో బ్లాక్ మొదటి అంతస్తులో ఎక్సైజ్ శాఖ కార్యాలయానికి రాత్రి 7.34 గంటలకు మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభోత్సవం చేశారు. ఇదిలాఉండగా సోమవారం ఉదయం 8.03 గంటలకు స్ర్తి, శిశు సంక్షేమ శాఖ కార్యాలయాన్ని మంత్రులు పీతల సుజాత, మానవ వనరుల శాఖ పేషీని ఉదయం 9.09 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించనున్నారు.

చిత్రాలు.. ఎక్సైజ్ మంత్రిత్వ శాఖ కార్యాలయంలోపూజలు చేస్తున్న మంత్రి కొల్లు రవీంద్ర

ఇరిగేషన్ మంత్రిత్వ శాఖ కార్యాలయం ప్రారంభం సందర్భంగా మంత్రి ఉమను
అభినందిస్తున్న నీటి సంఘాల అధ్యక్షులు