రాష్ట్రీయం

నాకెందుకు భయం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కదిరి/చిత్తూరు, ఆగస్టు 28: ‘రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే విషయంలో ఎవరికీ భయపడను. నాకు ప్రజలే హై కమాండ్’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆదివారం అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో సిఎం పర్యటించారు. ఈ సందర్భంగా శనివారం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ప్రత్యేక హోదాపై పవన్ మాట్లాడటాన్ని స్వాగతిస్తున్నామని, అయితే తాను హోదాపై మాట్లాడటానికి భయపడుతున్నానని పవన్ పేర్కొనడం సబబు కాదని అన్నారు. కాంగ్రెస్, వైకాపా నాయకుల మాదిరిగా తాను ఎవరికీ భయపడనన్నారు. అలిపిరిలో ఉగ్రవాదులు దాడి చేస్తారని తెలిసి కూడా ఎదురెళ్లిన సంగతిని గుర్తుచేస్తూ తాను జీవితంలో ఎవరికీ భయపడలేదని, భయపడను కూడా అన్నారు. అనంతపురం జిల్లా కదిరి నియోజకవర్గంలోని కోటపల్లిలో ‘పంట సంజీవని’ కార్యక్రమంలో భాగంగా రైతులతో ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడారు. అలాగే చిత్తూరు జిల్లా వి.కోట మండల కేంద్రంలో జరిగిన బహిరంగ సభలోనూ ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. ప్రత్యేక హోదా కోసం ఢిల్లీకి 23 సార్లు వెళ్లి ప్రధానమంత్రి మోదీ, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, తదితరులను కలిశానన్నారు. హోదా కోసం గత రెండేళ్లుగా కేంద్రంపై వత్తిడి తెస్తూనే ఉన్నామని, అయితే కేంద్రం నుంచి సహకారం అందడం లేదన్నారు. విభజన సమయంలో రాష్ట్రానికి రూ. 16,000 కోట్లు ఇస్తామని చెప్పారని, అయితే కేవలం రూ. 3,900 కోట్లు మాత్రమే ఇచ్చారన్నారు. రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణానికి నిధులు ఇవ్వాల్సి ఉందన్నారు. రైల్వేజోన్ ఇస్తామని ఇంతవరకూ ఇవ్వలేదని తెలిపారు. అప్పట్లో ప్రతిపక్షంలో వున్న ప్రస్తుత కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు ప్రత్యేకహోదాపై పోరాడారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే కేంద్రంతో కలసి పనిచేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ముంపు గ్రామాలను తమకు ఇవ్వాలని పట్టుపట్టడంతోనే నేడు పోలవరం ప్రాజెక్టు మనకు దక్కిందన్నారు. రాయలసీమలో కరవును శాశ్వతంగా నివారించాలన్నదే ధ్యేయమని, ఇందుకోసం ఎన్ని లక్షలైనా వ్యయం చేస్తామన్నారు.

చిత్రం.. కోటపల్లిలో జరిగిన సభలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు