రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతోపాటు తెలంగాణలోని ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో వచ్చే 24 గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) ప్రకటించింది. నైరుతీ రుతుపవనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో చురుకుగా ఉన్నాయని, వీటికితోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సహకరిస్తోందన్నారు. పశ్చిమమధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. బంగాళాఖాతంలో ఉపరితలద్రోణి ఏర్పడి ఉందని, వీటి కారణంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ
వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.
గడచిన 24 గంటల్లో పిడుగురాళ్లలో తోమ్మిది సెంటీమీటర్లు, కారంచెడు, జడ్చర్లలో 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా జిల్లాల్లో ఒక మోస్తరు నుండి భారీగా వర్షపాతం నమోదైందని ఐఎండి శాస్తవ్రేత్త నరేష్ కుమార్ ఆదివారం వివరించారు.