రాష్ట్రీయం

తెలంగాణకు సిఎన్‌బిసి అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: తెలంగాణ తాజాగా సిఎన్‌బిసి నుంచి మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డు దక్కించుకుంది. ప్రతి ఏడాది సిఎన్‌బిసి టీవి నిర్వహించే ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్‌లో భాగంగా రాష్ట్రానికి ఈ అవార్డు దక్కింది. జాతీయస్థాయిలో ప్రభుత్వాలకు, పరిశ్రమ, క్రీడా, సామాజిక, కళ, వినోద రంగాల్లో విజేతలకు అవార్డులను ఏటా సియన్‌బిసి ప్రదానం చేస్తోంది. తెలంగాణ చేపట్టిన వినూత్నమైన, పారదర్శక విధానాలను పరిగణలోకి తీసుకున్న సియన్‌బిసి అవార్డు ప్రకటించింది. ఈనెల 30న ఢిల్లీలో అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఐటి మంత్రి కె తారక రామారావు అవార్డును స్వీకరిస్తారు. తెలంగాణ ప్రభుత్వ పని తీరు, పారదర్శకతకు ఈ అవార్డు అవార్డు సాక్ష్యంగా నిలుస్తుందని వ్యాఖ్యానించారు.