రాష్ట్రీయం

అభ్యంతరాల వెల్లువ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: కొత్త జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ప్రతిపాదిత జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో చేర్పులు, మార్పులను సూచిస్తూ పెద్ద మొత్తంలో ప్రభుత్వానికి ఆన్‌లైన్‌లో వినతులు అందుతున్నాయి. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై ఈనెల 22న నోటిఫికేషన్ విడుదల చేస్తూ సెప్టెంబర్ 22లోగా ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు, సూచనలు ఇవ్వొచ్చంటూ భూపరిపాలన శాఖ కోరింది. మరుసటి రోజు నుంచే అభ్యంతరాలు, సూచనలు మొదలయ్యాయి. గత ఆరు రోజుల్లోనే 7 వేల 608 అభ్యంతరాలు, సూచనలు ప్రభుత్వానికి అందాయి. ఈ లెక్కన మిగిలిన మూడు వారాల్లో వచ్చే అభ్యంతరాలు, సూచనలు కలుపుకుంటే మొత్తంగా 50 వేల పైచిలుకు రావొచ్చని భూపరిపాలన శాఖ అంచనా వేస్తోంది. వచ్చిన అభ్యంతరాలు, సూచనలను ప్రాథాన్యతాక్రమంలో పరిశీలించి చేర్పులు, మార్పులపై సర్కారుకు నివేదిక అందించేందుకు భూ పరిపాలన శాఖ ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటి వరకూ జిల్లాలపై 4,477, రెవిన్యూ డివిజన్లపై 2004, మండలాలపై 1127 అభ్యంతరాలు, సూచనలు అందాయి. అత్యధికంగా వచ్చిన వాటిలో కరీంనగర్ నుంచి 2,325 వినతులు అందగా, అతి తక్కువగా నిజామాబాద్ నుంచి 145 అందాయి. జిల్లాల ఏర్పాటుపై అత్యధికంగా వరంగల్ జిల్లాలో ప్రతిపాదిత వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్, హన్మకొండ నుంచి 1162, మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతిపాదిత మహబూబ్‌నగర్, వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాల నుంచి 1113, నల్లగొండ జిల్లాలో ప్రతిపాదిత నల్లగొండ, యాదాద్రి, సూర్యాపేట నుంచి 1080, కరీంనగర్ జిల్లాలో ప్రతిపాదిత కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల నుంచి 485, రంగారెడ్డి జిల్లాలో ప్రతిపాదిత వికారాబాద్, మల్కాజ్‌గిరి, శంషాబాద్ జిల్లాల నుంచి 187 వినతులు అందాయి. రెవిన్యూ డివిజన్ల కూర్పుపై అత్యధికంగా కరీంనగర్ జిల్లా నుంచి 1634, వరంగల్ జిల్లా నుంచి 118, మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 78, మెదక్ జిల్లా నుంచి 64, ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి 33 చొప్పున, ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి 19 చొప్పున అభ్యంతరాలు, సూచనలు అందగా, అతి తక్కువగా నిజామాబాద్ జిల్లా నుంచి 5, హైదరాబాద్ నుంచి ఒకటి మాత్రమే అందాయి. మండలాల పునర్వ్యవస్థీకరణపై అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 214, కరీంనగర్ జిల్లా నుంచి 206, రంగారెడ్డి జిల్లా నుంచి 188, మెదక్ జిల్లా నుంచి 139, వరంగల్ జిల్లా నుంచి 129, నల్లగొండ జిల్లా నుంచి 99, ఖమ్మం జిల్లా నుంచి 64, నిజామాబాద్ జిల్లా నుంచి 62, ఆదిలాబాద్ జిల్లా నుంచి 25 అభ్యంతరాలు, సూచనలు అందాయి.