రాష్ట్రీయం

చత్తీస్‌గఢ్ నుంచే క్రాంతిసేన లేఖ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 28: గ్యాంగ్‌స్టర్ నరుూం ఎన్‌కౌంటర్ బూటకమని, టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను వదలిపెట్టమని హెచ్చరిస్తూ ఇటీవల క్రాంతిసేన పేరుతో విడుదలైన పత్రికా ప్రకటన చత్తీస్‌గఢ్ నుంచే వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. క్రాంతిసేన కేంద్ర కమిటీ సభ్యులు జగత్ పట్నాయక్ (ఒడిశా), మధు (మహారాష్ట్ర) పేరిట ఒక ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఈ లేఖ లెటర్‌హెడ్‌లో కాకుండా తెల్లకాగితంపై రాసి ఉండడం, ఎన్‌కౌంటర్ జరిగిన పది రోజుల తరువాత (ఆగస్టు 18) వారి సంతకాలతో కూడి ఉండడం పలు అనుమానాలకు తావిచ్చింది. దీంతో పోలీసులు క్రాంతిసేన లేఖపై దర్యాప్తు చేపట్టారు. ముందుగా ఈ లేఖ తెలంగాణలోని ఒక జిల్లా నుంచే వచ్చినట్టు పోలీసులు అనుమానించారు. ఇది ఆకతాయిల పనిగా భావించారు. అయితే నల్గొండ జిల్లాలో నరుూం అనుచరుల ఆగడాలు కొనసాగుతున్నాయని వచ్చిన వార్తలతో సిట్ అధికారులు క్రాంతిసేన లేఖను సీరియస్‌గా తీసుకొని ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో సదరు లేఖ చత్తీస్‌గఢ్ నుంచి కొందరు నరుూం అనుచరులు పంపినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. నరుూం అనుచరులపై దాడులు, ఇళ్లల్లో సోదాలు జరగకుండా ఉండేందుకే క్రాంతిసేన పేరుతో లేఖ పంపినట్టు పోలీసులు భావిస్తున్నారు. కాగా సదరు లేఖ నకిలీదా? లేదా నరుూం అనుచరుల్లో కొందరు కావాలని సృష్టించారా? అన్న విషయాన్ని సిట్ అధికారులు స్పష్టం చేయడం లేదు. ఇదిలావుండగా నరుూం అనుచరుల ఇళ్లలో ఆదివారం కూడా సోదాలు కొనసాగాయి. నల్గొండ జిల్లాలోని వలిగొండలో, మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ సమీపంలోగల అల్కాపురి, హైదరాబాద్ వనస్థలిపురంలో, ఖమ్మం జిల్లాలో సిట్ అధికారులు నరుూం అనుచరులపై ఆరా తీస్తున్నట్టు నల్గొండకు చెందిన ఓ సిట్ అధికారి తెలిపారు. ప్రజాజీవితంలోకి వచ్చేందుకే నరుూం నల్గొండ జిల్లాకు చెందిన హరిప్రసాద్‌రెడ్డి అనే జర్నలిస్టును సిఈవోగా పెట్టి వెబ్ చానల్ ఏర్పాటు చేయించాడు. భువనగిరి ఎమ్మెల్యే కావాలనేది నరుూం చిరకాల వాంఛ. ఇందుకు త్వరలోనే శాటిలైట్ చానల్ పెట్టేందుకు పక్కా ప్రణాళిక వేసుకున్నట్టు సిట్ విచారణలో తేలింది. జర్నలిస్టు హరిప్రసాద్‌ను సిట్ అధికారులు విచారిస్తుండగా అతను పలు ఆసక్తికర విషయాలు చెప్పినట్టు తెలిసింది. నరుూం నుంచి తాను (హరిప్రసాద్‌రెడ్డి) డబ్బులు ఎలా, ఎవరి ద్వారా తీసుకున్నదీ, నరుూంకు సెల్‌ఫోన్లు, సిమ్ కార్డులు ఎలా పంపిందీ, గత సంవత్సరం వినాయకచవితి ఉత్సవాల్లో తన పాత్ర, ఆ సమయంలో ఎవరెవరికి ఏం ఇచ్చిందీ, జర్నలిస్టులు, నరుూం అనుచరులకు ఎలాంటి గిఫ్ట్‌లు, నగదును ఇచ్చిందీ సిట్ అధికారులకు చెప్పినట్టు సమాచారం. జిల్లాలో మొత్తం 62 మందికి విలువైన గిఫ్టులు, నగదును హరిప్రసాద్ ద్వారా నరుూం అందజేసినట్టు నరుూం డైరీలో పేర్కొన్నట్టు సమాచారం. అదేవిధంగా తాను భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు తనకు ఎవరు పోటీగా నిలబడతారు, ఎంత మంది మావోయిస్టు సానుభూతిపరులున్నారో తెలుసుకొని చెప్పాలని కూడా హరిప్రసాద్‌రెడ్డికి నరుూం సూచించినట్టు తెలుస్తోంది. టివి చానళ్ల ద్వారా జనానికి దగ్గరై, తరువాత లొంగిపోయి ప్రజాజీవితంలోకి వచ్చేందుకు నరుూం పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టు సిట్ అధికారుల విచారణలో తేలినట్టు సమాచారం. నరుూంను కలిసేందుకు అతని మేనల్లుడు తబ్రేజ్ కారులో వెళ్లినట్టు తనకు కళ్లకు గంతలు కట్టి తీసుకెళ్లారని, ఎన్‌కౌంటర్ తరువాత తనకు ఎంతోమంది ఫోన్లు చేసి ఆరా తీశారని, నరుూం పోయాడు గనుక అనుచరులందరి ఇళ్ళపైనా దాడులు జరుగుతాయని అప్రమత్తంగా ఉండాలని వారికి హరిప్రసాద్ రెడ్డి సూచించినట్టు సిట్ విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. భూ కబ్జాలు, హత్యలు, సెటిల్‌మెంట్లు, అరాచకాలతో లెక్కలేనన్ని ఆస్తులు, నగదు పోగుచేసుకున్న గ్యాంగ్‌స్టర్ నరుూం వ్యవహారంలో మాత్రం పిసినారి అని తెలిసింది. చివరికి తన సొంత కుటుంబ సభ్యులకు కూడా సరిపడా డబ్బులు ఇచ్చేవాడు కాదని విచారణలో వెల్లడవుతున్న పలు అంశాలను బట్టి తెలుస్తోంది. నల్లగొండ జిల్లాలో ఉన్న నరుూం కుటుంబ సభ్యులు కొందరు అతను చేసిన పలు నేరాల్లో నిందితులు. అయినప్పటికీ కుటుంబం గడవడానికి బంగారం కుదువ పెట్టుకుని డబ్బులు తెచ్చుకున్నామని పోలీసు విచారణలో నరుూం కుటుంబ సభ్యులు పేర్కొన్నట్టు సిట్ అధికారులు తెలిపారు. మావోయిస్టుల తరహాలోనే నరుూం పక్కాగా మిలిటెంట్ డైరీ రాసుకునేవాడని, ఏ రోజు, ఎప్పుడు, ఎవరిని కలిసిందీ, ఏం పని చేసిందీ కూడా విధిగా డైరీలో రాసుకునేవాడని తేలింది. అంతేకాకుండా తనను కలసిన ప్రతి ఒక్కరి ఫొటో తీసి దాచి ఉంచుకునేవాడని, ఇందుకోసం తానున్న చోట తప్పనిసరిగా సిసి కెమెరా నిఘా ఉంచేవాడని సిట్ విచారణలో తేలింది.