రాష్ట్రీయం

అనకాపల్లి బిడ్డను కావడం గర్వంగా ఉంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, ఆగస్టు 28: సాహితీ పరిమళాలు వెదజల్లే అనకాపల్లి బిడ్డను కావడం పట్ల తనకెంతో గర్వంగా ఉందని, ఇక్కడ పెరిగిన వాతావరణమే తనను ఇంతటి స్థాయికి తీసుకెళ్లగలిగిందని ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెనె్నల సీతారామశాస్ర్తీ అన్నారు. స్థానిక రావుగోపాలరావు కళాక్షేత్రంలో ప్రముఖ సాహితీ సంస్థ డైమండ్ హిట్స్ ఆధ్వర్యంలో పద చక్రవర్తి అవార్డు ప్రదానోత్సవం ఆదివారం రాత్రి అత్యంత వైభవంగా జరిగింది. తనకు జరిగిన సత్కారానికి సిరివెనె్నల కృతజ్ఞతలు తెలియజేస్తూ ఐదు దశాబ్దాలుగా సాహితీ సేవలందిస్తున్న డైమండ్ హిట్స్ సంస్థ ద్వారా సత్కారం పొందడం తాను గర్వంగా భావిస్తున్నానన్నారు. తన జీవితంలో మరే ఇతర సత్కారాలకు ఇక్కడ జరిగిన గౌరవం మరిసాటి రాబోదన్నారు. డాక్టర్ కావాల్సిన తాను సినీ గేయ రచయితనవుతానని కలలో కూడా ఊహించలేదన్నారు. 14 భాషల్లో నిష్ణాతులు, హిందీ అధ్యాపకులుగా, హోమియో డాక్టర్‌గా అనకాపల్లికి సుపరిచితులైన సివి యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు కుమారుడిని కావడం తాను అదృష్టంగా భావిస్తున్నానన్నారు. విశాఖపట్నంపై ఒక ప్రత్యేకమైన సినీగేయాన్ని రాయాలనే మంత్రి గంటా కోర్కెను అతి త్వరలోనే తీర్చగలనన్నారు. డైమండ్ హిట్స్ వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తనకు పితృ సమానులన్నారు. డైమండ్ హిట్స్ సంస్థ చైర్మన్ దాడి రత్నాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు, ఎంపీ అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, స్టీల్ ప్లాంట్ చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ మధుసూదన్, యలమంచిలి మున్సిపల్ చైర్మన్ పి.రమాకుమారి తదితరులు ఈ సత్కార కార్యక్రమంలో పాల్గొన్నారు.

చిత్రం..సిరివెనె్నల దంపతులను సత్కరిస్తున్న ఏపి మంత్రి గంటా శ్రీనివాసరావు