రాష్ట్రీయం

నరుూం అక్రమాలపై సిబిఐ విచారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీబీనగర్, ఆగస్టు 28: గ్యాంగ్‌స్టర్ నరుూం అక్రమాలపై సిబిఐ చేత న్యాయ విచారణ జరిపించాలని నల్లగొండ ఎంఎల్‌సి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం మండల కేంద్రంలోని రహదారి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటుచేసిన సిట్ కమిటీతో ఎలాంటి న్యాయం జరగదని, సిట్ అధికారులు చేస్తున్న విచారణ నిజానిజాలు బయటికి తేవాలని, 20 సంవత్సరాల నుండి నరుూం కూడబెట్టిన 20 వేల కోట్ల రూపాయల ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పేదలకు పంచాలని ఆయన డిమాండ్ చేశారు. సిట్ కమిటీ వేయడంతోపాటు ప్రభుత్వం ప్రత్యేక జివోను జారీ చేసి అక్రమ ఆస్తులలో అన్ని శాఖల ఆధికారులకు భాగస్వామ్యం కల్పించాలన్నారు.
నరుూం అక్రమాలతో సంబంధమున్న రాజకీయ నాయకులపై విచారణ చేపట్టాలని ఆయన కోరారు. నల్లగొండ, భువనగిరి ప్రాంతంలో భూకబ్జాలకు పాల్పడినట్లు ఆయన తెలిపారు. నరుూం ఆగడాలలో భూములు కోల్పోయిన పేదలకు తిరిగి వారి భూములను స్వాధీనం చేయాలని అన్నారు. నరుూం అక్రమాలపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సమావేశంలో జడ్పీటిసి సందిగారి బస్వయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్యాంగౌడ్, డిసిసి ప్రధాన కార్యదర్శి పంజాల రామాంజనేయులుగౌడ్, చెరుకు అచ్చయ్యగౌడ్, మాజి ఎంపిపి టంటం లక్ష్మయ్యగౌడ్, ఎంపిటిసిలు పంజాల వెంకటేశ్‌గౌడ్, గడ్డం బాలక్రిష్ణ, నాయకులు బండారు ఆగమయ్యగౌడ్, నారగోని మహేశ్‌గౌడ్, పంజాల శ్రీనివాస్ గౌడ్, కాటెపల్లి సుభాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.