రాష్ట్రీయం

రూ.200 కోట్ల వెంచర్ వెనుక నరుూం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 29: గ్యాంగ్‌స్టర్ నరుూమొద్దీన్ అలియాస్ నరుూం ఎన్‌కౌంటర్ తరువాత అతని అక్రమ దందాలు, హత్యలు, ఆస్తులు, సెటిల్‌మెంట్లకు సంబంధించి లెక్కకు మించి నోరెళ్లబెట్టే విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా రంగారెడ్డి జిల్లా బాలాపూర్ శివార్లలోని ప్రైడ్ ఇండియా గ్రూప్‌కు సంబంధించిన ఒక వెంచర్ వ్యవహారంలో నరుూం హస్తం ఉన్నట్టు సిట్‌కు ఫిర్యాదు అందింది. రూ. 200 కోట్ల విలువైన ఈ వెంచర్ కోసం ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని అక్కడి దేవతల గుట్టమీద ఉన్న దేవాలయాన్ని కూల్చివేశారని స్థానిక ప్రజలు కొన్నాళ్లుగా అందోళనకు దిగారు.
కూల్చేసిన ఆలయాన్ని తిరిగి నిర్మించాలంటూ స్థానికులు చేపట్టిన ఉద్యమం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ విషయమై స్థానికులకు అండగా ఉన్న బిజెపి నేత శంకర్‌రెడ్డిని నరుూం అనుచరులు గతంలో బెదిరించారు. ఈ సంఘటనపై శంకర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేయాలంటూ పహాడిషరీఫ్ పోలీస్ ఇనె్స్పక్టర్‌ను సైబరాబాద్ కమిషనర్ అప్పట్లో ఆదేశించారు. ఈ సంఘటనలో నరుూంపై కేసు నమోదు కాకపోగా, ఆ ఫిర్యాదు మాయమైనట్టు తెలిసింది. ఇదిలావుండగా నరుూం బాటలోనే ప్రైడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సనోవర్ బేగ్ నడిచేవాడని స్థానికులు ఆరోపించారు. ఈ ఫిర్యాదుపై సంబంధిత అధికారులు విచారణకు కూడా ఆదేశించారు. అయితే ప్రైడ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ అక్రమాలపై ఫిర్యాదు చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని బాలాపూర్ గ్రామస్థులు ఆరోపించారు. నరుూంకు ప్రధాన అనుచరుడిగా చెప్పుకుంటూ బెదిరింపులకు పాల్పడ్డ ప్రైడ్ ఇండియా ఎండి సనోవర్ బేగ్‌కు మాఫియాతో లింక్‌లున్నాయని, బంగారం స్మగ్లింగ్ చేసేవాడని స్థానికులు చెప్పారు. దీనిపై డిఆర్‌ఐ అధికారులు కూడా విచారణ జరిపారని గ్రామస్తులు తెలిపారు. ఇదిలావుండగా సోమవారం పుప్పాలగూడలోని నరుూం ఇంట్లో సిట్ అధికారులు మరోసారి సోదా జరిపారు. నరుూం డెన్‌లో చీరల డంప్‌ను కనుగొన్నారు. దాదాపు రూ. 2 కోట్లు విలువ చేసే చీరలను స్వాధీనం చేసుకున్నారు. వినాయక చవితి వేడుకల సందర్భంగా మహిళలకు పంచేందుకు ఈ చీరలను నరుూం కొన్నట్టు తెలుస్తోందని సిట్ అధికారులు తెలిపారు.
సిట్ అధికారులు జరుపుతున్న విచారణలో ఓ అనుచరుడు ఇచ్చిన సమాచారం మేరకు ఈ డెన్‌లో సోదా నిర్వహించినట్టు తెలిసింది. నరుూం ముఖ్య అనుచరుల్లో ఒకరయిన నరేందర్‌రెడ్డిని సోమవారం వనస్థలిపురంలో సిట్ అధికారులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు. అదేవిధంగా ఖమ్మంలో అరెస్టయిన నరుూం డ్రైవర్ శామ్యూల్‌ను పిటీ వారంట్‌పై హైదరాబాద్ తీసుకువచ్చి, హయత్‌నగర్ కోర్టులో హాజరుపరచిన తరువాత చర్లపల్లి జైలుకు తరలించినట్టు సిట్ అధికారులు తెలిపారు.