ఆంధ్రప్రదేశ్‌

హోమియో పరీక్షల్లో అవకతవకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 30: హోమియో వైద్య పరీక్షల్లో అవకతవకలు వెలుగు చూశాయి. రాజమహేంద్రవరంలోని అల్లు రామలింగయ్య హోమి యో కళాశాలలో పరీక్షల ఒఎంఆర్ షీట్లు తారుమారైన విషయం యూనివర్శిటీ ఉన్నతాధికారులు జరిపిన విచారణలో నిర్ధారణ అయింది. దీంతో ప్రిన్సిపాల్‌ను పరీక్షల విధుల నుంచి తప్పిస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ఆదేశాలు జారీచేశారు. అసలు విషయంలోకెళితే.. రాజమహేంద్రవరంలోని అల్లు రామలింగయ్య హోమియోపతి మెడికల్ కాలేజిలో 2015 సెప్టెంబర్‌లో హోమి యో విద్యార్ధులకు జరిగిన యూనివర్శిటీ పరీక్షల్లో దువ్వాడ మాధవరావు దీపక్ అనే విద్యార్ధికి (హాల్ టిక్కెట్ నెంబర్ 0623005) పరీక్ష నిర్వహించిన అధ్యాపకులు వేసిన మార్కులను ఒఎంఆర్ షీట్‌లో తారుమారుచేసి అధిక మార్కు లు వేశారు. దీనిపై అధ్యాపకులు యూనివర్సిటీ అధికారులకు గత డిసెంబర్‌లో ఫిర్యాదుచేశారు. దీనిపై యూనివర్సిటీ విచారణ జరిపింది. విచారణ నివేదికను గత ఏడాది మార్చి 19న యూనివర్సిటీ అధికారులకు అందింది. ఈ నివేదిక ఆధారంగా అల్లు రామలింగయ్య హోమియోపతి మెడికల్ కాలేజికి పూర్తి అదనపు బాధ్యలతోప్రిన్సిపాల్‌గావున్న డాక్టర్ వి.వీరబద్రరావును పరీక్షలకు సంబంధించిన అన్ని విధుల నుంచి తప్పిస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వైస్-్ఛన్సలర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈ మేరకు ఆయుష్ విభాగం ద్వారా ఈ ఉత్తర్వులను గత మే మూడో తేదీన జారీచేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ వి.వీరభద్రరావు మీద తగిన చర్యలు తీసుకోవాలని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ నుంచి ఆయుష్ కమిషనర్‌కు లేఖ రాశారు.
ఆయుష్ కమిషనర్ కార్యాలయం నుంచి సమాచార హక్కు చట్టం ద్వారా వచ్చిన సమాచారం మేరకు ఈ విషయం వెలుగులోకి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ళ సుబ్బారావు తెలియజేశారు. సంవత్సరాల తరబడి ఎఫ్‌ఎసి బాధ్యతల్లోవున్న ప్రిన్సిపాల్‌ను తప్పించి, కళాశాలకు రెగ్యులర్ ప్రిన్సిపాల్‌ను నియమించాలని డిమాండ్ చేశారు. పరీక్షల ఒఎంఆర్ షీట్లలో అక్రమాలు నిరూపణ అయింది కాబట్టి ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. ప్రిన్సిపాల్ విద్యార్ధులను వ్యక్తిగత వేధింపులకు గురి చేస్తున్నారని, అధ్యాపకులను సైతం వదలడం లేదని అనేక ఆరోపణలున్నాయని, త్వరలో ఆధారాలతో సహా బహిర్గతం చేస్తామని ముప్పాళ్ళ పేర్కొన్నారు.
కాగా ఒఎంఆర్ షీట్ల తారుమారుతో తనకు సంబంధంలేదని, మార్కుల అవకతవకలపై విచారణ జరిగిందని ప్రిన్సిపాల్ డాక్టర్ వెన్నా వీరభద్రరావు వివరణ ఇచ్చారు. తనను పరీక్షల విధుల నుంచి ఎందుకు తప్పించారో తెలియజేయాలని కోరుతూ యూనివర్స్శిటీకి లేఖ రాశానన్నారు.