ఆంధ్రప్రదేశ్‌

కాకినాడ ఎంవిఐ ఇంట్లో ఏసిబి సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 31: ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నారనే అభియోగంపై కాకినాడ రవాణా శాఖ కార్యాలయ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ నివాసంపై అవినీతి నిరోధక శాఖాధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. సదరు అధికారి నివాసంతో పాటు వేర్వేరు ప్రాంతాల్లో ఆరుచోట్ల నిర్వహించిన సోదాల్లో సుమారు కోటి రూపాయల విలువైన ఆస్తులను కనుగొన్నారు. ఇందుకు సంబంధించి ఎసిబి అధికారులు వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ ఆర్టీవో కార్యాలయంలో మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న రావు అప్పారావు ఆదాయానికి మించి ఆస్తులు కలిగివున్నట్టు ఎసిబికి ఫిర్యాదులందాయి. దీంతో బుధవారం ఉదయం నగరంలోని సర్పవరం గ్రామంలో ఎంపిడిఒ కార్యాలయం ఎదురుగా అప్పారావు నివాసానికి చేరుకున్న అధికారులు సోదాలు చేపట్టారు. కాకినాడ జిల్లా క్రీడా మైదానం వద్ద అప్పారావుకు చెందిన మరో గృహంపై కూడా అధికారులు దాడిచేశారు. కాకినాడ నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆరుచోట్ల అప్పారావు బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు కోటి రూపాయల ఆస్తులను గుర్తించినట్టు రాజమహేంద్రవరం ఎసిబి డిఎస్పీ రామచంద్రరావు విలేఖరులకు తెలిపారు. నగదు, నగలు, డాక్యుమెంట్లను గుర్తించినట్టు పేర్కొన్నారు. దాడి సమయంలో మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ అప్పారావు తన నివాసంలోనే ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎసిబి డిఎస్‌పి రామచంద్రరావు తెలిపారు.