ఆంధ్రప్రదేశ్‌

కొవ్వాడ కాలువలో ఇద్దరు గల్లంతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాళ్లపూడి, ఆగస్టు 31: భారీ వర్షాల కారణంగా హఠాత్తుగా వచ్చిన వరద ప్రవాహానికి బుధవారం పశ్చిమ గోదావరిలో కాలువ దాటుతున్న ఒక రైతు, మరో వ్యవసాయ కూలీ గల్లంతయ్యారు. సాయంత్రానికి ఒకరి మృతదేహం లభ్యంకాగా, మరొకరి కోసం గాలిస్తున్నారు. వివరాలిలావున్నాయి... పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామానికి చెందిన రైతులు, వ్యవసాయ కూలీలు తమ గ్రామంలో ప్రవహించే కొవ్వాడ కాలువను దాటి, వ్యవసాయ పనులకు వెళుతుంటారు. బుధవారం ఉదయం అలాగే కాలువ దాటడానికి ప్రయత్నించిన ముప్పిలి వెంకటేశ్వరరావు అనే రైతు, దొడ్డి మురళీకృష్ణ (30) అనే వ్యవసాయ కూలీ కాలువలోని వరద ప్రవాహంలో చిక్కుకున్నారు. వీరితోపాటు ఉన్న మహిళా కూలీలు సురక్షితంగా ఆవలి ఒడ్డు చేరుకున్నారు. వరదలో చిక్కుకున్న వారిద్దరినీ రక్షించడానికి మిగిలిన కూలీలు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వారిరువురూ ప్రవాహంలో కొట్టుకుపోయి, గల్లంతయ్యారు. సాయంత్రానికి రైతు వెంకటేశ్వరరావు మృతదేహం లభ్యమయ్యింది. గల్లంతైన మురళీకృష్ణ కోసం గాలిస్తున్నారు. మలకపల్లి విఆర్వో వెంకటేశ్వరరావు, తిరుగుడుమెట్ట విఆర్వో షేక్ మస్తాన్, తాళ్లపూడి పోలీస్ సిబ్బంది సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.