ఆంధ్రప్రదేశ్‌

‘దివీస్’ ఏర్పాటుపై ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఆగస్టు 31: తూర్పు గోదావరి జిల్లాలోని తొండంగి మండలంలో దివీస్ లేబొరేటరీస్ మందుల ఫ్యాక్టరీ బాధితులకు మద్దతుగా ఆందోళన బాట పట్టిన సిపిఎం నేతలను బుధవారం పోలీసులు అరెస్టుచేశారు. ఈ ప్రాంతంలో బహిరంగ సభ నిర్వహించడానికి ప్రయత్నించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు సహా 11 మందిని పోలీసులు అరెస్ట్ చేసి అన్నవరం, తొండంగి పోలీస్ స్టేషన్లకు తరలించారు. మండలంలోని కొత్తపాకల గ్రామం వద్ద బహిరంగ సభ నిర్వహించడానికి మధు సహా రైతులు, బాధితులు సిద్ధమయ్యారు. పోలీస్ పికెట్ కొనసాగుతున్న నేపథ్యంలో నేతల రాకపై నిఘా ఉండటంతో, ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. సభ నిర్వహణకు అనుమతులు లేకపోవడంతో వెనక్కివెళ్లాలని పోలీసులు సూచించారు. అయితే రైతులు, బాధితుల పక్షాన సభ నిర్వహించడానికి అనుమతులు అవసరంలేదని మధు స్పష్టంచేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం జరిగింది. రైతులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ సంఘటనలో మధు సహా 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని తొండంగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుండి మధుతో పాటు మరో ఆరుగురిని అన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మధుతో పాటు అరెస్టయిన వారిలో సిపిఎం తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు దువ్వా శేషుబాబ్జీ, రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం నేతలు కెఎస్ శ్రీనివాస్, టి క్రాంతి, నరసింహరావు, సింహాచలం తదితరులున్నారు. అంతకు ముందు బాధితులతో మధు మాట్లాడుతూ దివీస్ మందుల ఫ్యాక్టరీ బాధితుల పోరాటానికి సిపిఎం సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. స్థానిక రైతులు, ప్రజలు అధైర్యపడకుండా పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. దివీస్ మందుల ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఎట్టిపరిస్థితుల్లో జరుగనివ్వమని, ఇందుకు ఎంతటి త్యాగానికైనా సిద్ధంగా ఉంటామని మధు భరోసా ఇచ్చారు.

రాజీనామా చేసి
నిజాయతీ నిరూపించుకో
బాబుకు వైకాపా నేత ధర్మాన సవాల్
ఆంధ్రభూమి బ్యూరో
శ్రీకాకుళం, ఆగస్టు 31: ఓటుకు నోటు కేసులో ఎసిబి ట్రయల్ కోర్టు విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవికి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని వైకాపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. బుధవారం ఆయన ఇక్కడి పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ పోలీసు రికార్డుల్లో చంద్రబాబు పట్ల 32 పర్యాయాలు ప్రస్తావనకు వచ్చినపుడు దానికి అనుగుణంగా బాబు గొంతును ఫోరెన్సిక్ ల్యాబ్ నిర్ధారించినందున కేసునుండి తప్పించుకోలేరన్నారు. ఎసిబి ట్రయల్ కోర్టు పేర్కొన్న విధంగా వచ్చేనెల 29లోపు విచారణ చేపట్టి చార్జిషీటు దాఖలు చేయాలని చెప్పినందున విచారణలో పారదర్శకతకు రాజీనామాయే మార్గమన్నారు. తద్వారా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలుస్తారన్నారు. ఒకవేళ చార్జిషీటులో చంద్రబాబు పేరులేకపోతే మళ్లీ ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చని, అంతవరకు నెలరోజులు సిఎం పదవికి రాజీనామా చేయాలన్నారు. ఇదిలావుంటే ఒక ముఖ్యమంత్రి ఇటువంటి స్థితికి చేరుకొని కేసును నీరుగార్చే ప్రయత్నంలో బాగంగా కేంద్ర మంత్రులతో కలవడం పట్ల దేశ ప్రజలకు వ్యవస్థలపైనే అపనమ్మకం ఏర్పడుతుందన్నారు. ఇది చాలా చెడ్డ సంప్రదాయానికి దారితీస్తుందంటూనే ఒకవేళ చంద్రబాబు తన పదవికి రాజీనామా చేయనట్లైతే గవర్నర్ అయినా సలహా ఇచ్చి గౌరవ ప్రదమైన సంప్రదాయాన్ని కొనసాగించాలన్నారు. 2012లో తనపై ఆరోపణలు వచ్చినపుడు తాను మంత్రి పదవికి రాజీనామా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసారు. దీనిపై బాబు ఇతరులతో మాట్లాడించడం సరికాదని, ముందు రాజీనామా చేయాలని అన్నారు. అలా చేయనట్లైతే రాష్ట్ర పౌరులకు వ్యవస్థల పట్ల అగౌరవానికి దారితీసేలా ప్రోత్సహించిన వారవుతారని విమర్శించారు. మీరు తప్పు చేయనపుడు కేంద్ర మంత్రులతో మంతనాలు చేయాల్సిన అవసరం లేదని, ఒక నెలరోజులు రాజీనామా చేసినంత మాత్రాన పాలన ఏమీ కాదన్నారు. 11 ఏళ్లు ముఖ్యమంత్రి పదవిలో ఉన్న బాబు వ్యవస్థలను పాడుచేయడం భావ్యం కాదని, రాజ్యాంగ స్పూర్తికి, ప్రజా స్వామ్య విలువలకు ప్రాధాన్యత నివ్వాలని ప్రజలు బావిస్తున్నారన్నారు.