ఆంధ్రప్రదేశ్‌

పంటలను కాపాడుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 31: ఎండిపోతున్న వేరుశనగతో సహా ఇతర ముఖ్యపంటలను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన పంటతడి అందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అనంతపురం నుంచి ఆయన బుధావరం అధికారులు, ప్రజాప్రతినిధులతో టెలీకాన్ఫరెభ్స్‌ను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు పడటం ఎంతో సంతోషించదగ్గ అంశమని అయితే అంతమాత్రం చేత ఉదాశీనత తగదని, వర్షాలు లేని ప్రాంతాల్లో పంట ఎండిపోకుండా తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఎకరం పంటకూడా ఎండిపోకుండా తక్షణ రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కరవుపై చేస్తున్న ఈ యుద్ధంలో ఇది తొలి అంకం మాత్రమేనని ముందుముందు ఒకవేళ కరవు పరిస్థితులు ఏర్పడిన పక్షంలో ఇప్పుడు కరవును ఎదుర్కొన్న విధానం ఆదర్శం అవుతుందన్నారు. పంటసంజీవనిని తేలిగ్గా తీసుకోవద్దని తాను మొదటి నుంచి చెబుతున్న విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పడు కష్టకాలంలో రైతాంగానికి పంటసంజీవని పై భరోసా ఏర్పడిందని, రెయిన్ గన్స్‌పై విశ్వాసం కుదిరిందని ఆయన తెలిపారు. ఎండిపోతున్న పంటలను పంటసంజీవని ద్వారా కాపాడుతున్న అంశంపై సిబ్బంది అవిశ్రాంతంగా పని చేయాలని విజ్ఞప్తి చేశారు. పంటలు ఎండకుండా, భూమిలో తడి ఇంకిపోకుండా ప్రభుత్వం చేయదగిన స్థాయిలో పని చేస్తుందన్నారు. స్వచ్ఛంద సంస్థలు కూడా కరవు నివారణలో భాగస్వాములు కావాలని సిఎం తెలిపారు. విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, ఇంజనీరింగ్ విద్యార్ధులు క్షేత్రస్థాయిలో పర్యటనలకు వెళ్లాలని, రైతాంగంలో చైతన్యం తీసుకురావాలన్నారు. కరవు నివారణ చర్యలై అధ్యయనం చేసి తగిన సూచనలు చేయవచ్చని సిఎం చెప్పారు. రెయిన్‌గన్స్, ట్యాంకర్లు, ఆయిల్ ఇంజన్ల సంఖ్యపై ప్రతిరోజు రియల్ టైమ్ సమాచారం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. వర్షపాత వివరాలపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుందన్న భావన రైతుల్లో రావాలని అన్నారు. పనిలో వేగం వుండాలని ఫలితం రాబట్టాలని సకాలంలో సమాచారం అందించాలని కోరారు. ఈ టెలికాన్ఫరెన్స్ క్షేత్ర స్థాయిలోని జలవనరులు, వ్యవసాయం, రెవెన్యూ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.