ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపురం, ఆగస్టు 31: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, దానిని సాధించేంతవరకూ కాంగ్రెస్ పార్టీ విశ్రమించదని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై రోజుకో మాట చెబుతున్న టిడిపి, బిజెపిలకు చిత్తశుద్ధిలేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కేవలం టైంపాస్ ముఖ్య మంత్రి అని ఆయన ఎద్దేవాచేశారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురంలో బుధవారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ప్రత్యేక హోదా ఇవ్వడానికి 14వ ఆర్థిక సంఘం ఆడ్డుగా ఉందని, రాష్ట్రాలు అంగీకరించవని బిజెపి చేస్తున్న ప్రకటనల్లో వాస్తవం లేదన్నారు. కేవలం ప్రజలను మోసగించేందుకే బిజెపి, టిడిపిలు నాటకాలు ఆడుతున్నాయన్నారు. బిజెపి, టిడిపి చెపుతున్న దానిపై ఆరాతీయడానికి తాము ఢిల్లీలో 14వ ఆర్థిక సంఘం రూపుకర్త అభిజిత్‌సేన్‌ను కలిశామని, అయితే హోదాకు సంబంధించిన అంశాలేవీ నివేదికలో లేవని ఆయన మీడియా ముందు స్పష్టంచేశారని రఘువీరా వివరించారు. రాష్ట్రాలు అంగీకరించవని చెప్పడంపై కూడా కేంద్రం తీరును రఘువీరా తప్పుపట్టారు. ఇప్పటికే 11 పార్టీలు, 9 రాష్ట్రాలు ప్రత్యేక హోదాకు మద్దతు తెలిపాయన్నారు.
ఫిబ్రవరి 20, 2014న రాజ్యసభలో అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను అమలుచేయాలని డిమాండ్‌చేశారు. మార్చి 1, 2014లో ప్రత్యేక హోదాకు సంబంధించిన తీర్మానానికి కేంద్ర కేబినెట్ అమోదం తెలిపిందని, రూ.5 లక్షల కోట్ల మేర ఆంధ్రప్రదేశ్‌కు మేలుజరిగేలా చట్టంలో పొందు పరిచారన్నారు. ఆ నిధులను సాధించడంలో టిడిపి ప్రభుత్వం విఫలమయ్యిందన్నారు. కేవలం రూ. 6వేల కోట్లు మాత్రమే ఇచ్చారని సాక్షాత్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పడం విడ్డూరమన్నారు. పై అంశాలే ప్రత్యేక హోదా సాధనలో టిడిపి, బిజెపిలకు చిత్తశుద్ధిలేదనడానికి నిదర్శనమన్నారు. సెప్టెంబర్ 2న ఏదో ప్రకటన వెలువడుతుందని టిడిపి శ్రేణులు చెపుతున్నాయని, ఏదోప్రకటించడంకాదు ప్రత్యేక హోదాయే కావాలని రఘువీరా స్పష్టంచేశారు. చంద్రబాబు ప్రజల దృష్టిని మళ్లించడానికి కృష్ణా పుష్కరాలకు నెల రోజుల సమయాన్ని వృథాచేసి టైంపాస్ ముఖ్యమంత్రిగా రికార్డుకెక్కారని ఎద్దేవాచేశారు.

విలేఖరులతో మాట్లాడుతున్న ఎపిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి