ఆంధ్రప్రదేశ్‌

మహిళా వికాసానికి కృషి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, సెప్టెంబర్ 2: భారతదేశంతో ఎల్లపుడూ ఆస్ట్రేలియా దౌత్య సంబంధాలను కొనసాగిస్తోందని భారత్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్ హరిందర్ సిద్ధూ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని జెఎన్‌టియుకెలో శుక్రవారం కేంద్ర మాజీ మంత్రి, దివంగత మల్లిపూడి శ్రీరామ సంజీవరావు జ్ఞాపకార్థం వర్సిటీలోని ఇసిఇ బ్రాంచ్‌లో టాపర్‌గా నిలిచిన విద్యార్థి నాగలక్ష్మీప్రవల్లికకు బంగారు పతకాన్ని హరిందర్ సిద్ధూ చేతుల మీదుగా బహుకరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ, ఆధునిక యుగంలో మహిళలు ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలలో దూసుకువెళ్తున్నారని ప్రశంసించారు. భారత దేశం సంస్కృతి, సంప్రదాయాలకు పుట్టినిల్లు వంటిదన్నారు. అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చన్నారు. ఎగుమతి, దిగుమతి రంగాలలో కూడా భారత్ అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. దేశంలో మహిళా వికాసానికి, విద్యార్థినులు అత్యున్నత శిఖరాలను అధిరోహించేందుకు విశ్వ విద్యాలయాలు అవిరళ కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఆస్ట్రేలియాలో భౌగోళిక పరిస్థితులు, అక్కడి సంస్కృతి-సంప్రదాయాలు, ఆధునిక పరిస్థితుల నేపథ్యంలో చోటుచేసుకుంటున్న మార్పులను ఆమె వివరించారు. బంగారు పతక విజేత నాగలక్ష్మీప్రవల్లికను ఈ సందర్భంగా ఆమె అభినందించారు.
శ్రీరామ సంజీవరావు కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్ళంరాజు మాట్లాడుతూ తన తండ్రి జ్ఞాపకార్థం ఇకనుండి ప్రతి ఏటా సాంకేతిక విద్యారంగంలో అసమాన ప్రతిభ చూపిన విద్యార్థులకు బంగారు పతకాలు బహూకరించనున్నట్టు చెప్పారు. దేశంలో సాంకేతిక విద్య, విజ్ఞాన శాస్త్రాల అభివృద్ధికి సంజీవరావు తన వంతు కృషిచేశారని పేర్కొన్నారు. జెఎన్‌టియుకె వైస్ చాన్సలర్ ఆచార్య విఎస్‌ఎస్ కుమార్ మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ రంగాభివృద్ధికి సంజీవరావు ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. భారత సైన్యానికి ఉపయోగపడేందుకు ఒక సీక్రెసీ సిస్టమ్‌ను రూపొందించిన ఘనత కూడా ఆయనకే దక్కిందని, భావి ఇంజనీరింగ్ విద్యార్థులు ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. టి హబ్ సిఇఒ జె కృష్ణన్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు ఉద్యోగాలకై ఆరాటపడకుండా స్టార్టప్ ప్రోగ్రాంల ద్వారా వ్యవస్థాపకుల స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.

కాకినాడ జెఎన్‌టియు ఇసిఇ టాపర్ నాగలక్ష్మీ ప్రవల్లికకు
బంగారు పతకాన్ని బహూకరిస్తున్న హరిందర్ సిద్ధూ