ఆంధ్రప్రదేశ్‌

ఒఎన్‌జిసి బావి నుంచి గ్యాస్ లీకేజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లవరం, సెప్టెంబర్ 9: తూర్పు గోదావరి జిల్లా అల్లవరం మండలం తాడికోనలో మూసుకుపోయిన ఒఎన్‌జిసి బావి నుండి శుక్రవారం భారీగా గ్యాస్ లీకేజీ కలకలం సృష్టిస్తోంది. బావిలోకి సిబ్బంది రిగ్ ద్వారా రసాయనాలు పంపిస్తుండగా ఎయిర్ హౌస్ పగిలి గ్యాస్ లీకేజీ మొదలయ్యింది. రిగ్‌వద్ద విధులు నిర్వహిస్తున్న అసోం రాష్ట్రానికి చెందిన హనీసుల్‌హక్ అనే డ్రిల్లర్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో అతడిని అమలాపురంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అసోం పెట్రోలియం లిమిటెడ్ సంస్థ తాడికోన ఎస్‌ఆర్-2 రిగ్‌తో గత కొంత కాలంగా డ్రిల్లింగ్ పనులు నిర్వహిస్తోంది. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో బావి నుండి అదుపుకాని (అన్‌కంట్రోల్) గ్యాస్ లీకేజీ ప్రారంభమయ్యింది. దీంతో అప్రమత్తమైన స్థానిక సిబ్బంది గ్యాస్ లీకేజీ అదుపునకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. సాయంత్రానికి లీకేజీ మరింత పెరగడంతో రాజమండ్రి, నర్సాపురంలో ఉన్న ఓఎన్‌జిసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఒఎన్‌జిసి సాంకేతిక నిపుణులు సంఘటనా స్థలానికి చేరుకుని గ్యాస్ లీకేజీ అదుపుకు చర్యలు చేపట్టారు. ఒఎన్‌జిసి అధికార్ల సూచన మేరకు పోలీసులు తాడికోన గ్రామస్థులను అప్రమత్తం చేయడంతో ఇళ్లను ఖాళీచేసి, దూర ప్రాంతాలకు తరలిపోయారు. తాడికోన సమీప గ్రామమైన గూడాలలో కూడా ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. కాగా ఈ ఘటనపై ఒన్‌జిసి రీజినల్ క్రైసిస్ మేనేజర్ (అగ్నిమాపక దళాధికారి) జి శ్రీహరి విలేఖరులతో మాట్లాడుతూ నిరంతర గ్యాస్ లీకేజీ వల్ల బ్లోఅవుట్ జరిగే ప్రమాదం ఉందన్నారు. అయితే గ్యాస్ క్రూడ్ ఆయిల్ మడ్ పదార్థాలతో కలిసి వెలుపలకు రావడం వల్ల బ్లో అవుట్ ప్రమాదం ఉండకపోవచ్చన్నారు. స్థానికంగా ఉండే అగ్ని మాపక దళాలు ప్రస్తుతం ఇక్కడకు చేరుకున్నాయని, వీటితో లీకేజీని అదుపుచేయడం సాధ్యం కాదన్నారు. వేరే ప్రాంతాల నుండి ఆధునిక యంత్రాలను రప్పిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు తాడికోన గ్రామస్థులు ఓఎన్‌జిసి అధికారులతో వాగ్వాదానికి దిగారు. ప్రమాదకరమైన రిగ్ పనులు జరగుతుండగా ముందస్తు జాగ్రతగా ఫైర్ సిబ్బందిని ఎందుకు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలతో ఓఎన్‌జిసి చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అమలాపురం ఆర్డీవో జి గణేష్‌కుమార్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. సిఐ దేవకుమార్, ఎస్‌ఐ ప్రశాంత కుమార్ ఆధ్వర్యంలో భారీగా బందోబస్తు ఏర్పాటుచేశారు.