రాష్ట్రీయం

అత్యాశకు పోయి ఇళ్ల అద్దెలు పెంచొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 25: అకారణంగా భూముల విలువలను, ఇంటి అద్దెలను పెంచుకుంటూ పోతుంటే విజయవాడ నగరం ఎన్నటికీ కూడా అభివృద్ధి చెందబోదంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నగర వాసులను సున్నితంగా హెచ్చరించారు. నగర భవిష్యత్ కోసం అవసరమైతే అత్యాశకు పోకుండా త్యాగాలు చేయడానికి కూడా సిద్ధపడాలన్నారు. మరోపని లేకుండా కొందరు భూములు కొనటం లాభంతో విక్రయించుకుంటూ పోతుండటం వలనే ఇప్పటి వరకు ఈ ప్రాంతవాసులు హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టుకుంటూ పోయారు. అలాగే విజయవాడలో ఇంటి అద్దెలు.. అమ్మో రాలేమంటున్నారు. అసలు నేటి వరకు విజయవాడ పరిసరాల్లో చెప్పుకోదగిన పరిశ్రమ వచ్చిందాయని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో గత 25 ఏళ్ళుగా 11కు మించిన ఆసుపత్రుల్లో వైద్య సేవలందిస్తూ వచ్చిన డాక్టర్ కడియాల రాజేంద్ర, డాక్టర్ జి విజయ్‌శ్రీనివాస్, డాక్టర్ నిమ్మగడ్డ చక్రపాణి కలిసి సుమారు రూ. 15 కోట్లతో నగరంలో నెలకొల్పిన ఎపి సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాలను ముఖ్యమంత్రి బుధవారం ప్రారంభించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. సింగపూర్, అమెరికా వంటి అనేక దేశాల్లో భూమి విలువ ఇక్కడ కంటే చాలా తక్కువకు ఉండబట్టే అంధ్రులు కూడా వలస వెళ్లి అక్కడ పెట్టుబడులు పెడుతున్నారని అన్నారు. అలాగే రాత్రికి రాత్రి ఇంటి అద్దెలు పెంచుకుంటూ పోతే భవిష్యత్ అగమ్యగోచరంలా మారగలదన్నారు. అద్దె నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చే ఆలోచనన ప్రస్తుతానికి లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. భూముల విలువ అందుబాటులో ఉంటే కొత్తకొత్త పరిశ్రమలు, విద్యా, వ్యాపార, వాణిజ్య, వైద్య సంస్థలనేకం వచ్చి ఉపాధి అవకాశాలు పెరిగి అందరికీ వ్యాపార టర్నోవర్ పెరుగుతుందన్నారు. ప్రజలందరూ పన్నులు కడుతుంటే పన్నుల భారాన్ని పెంచాలనే ఆలోచన ఎందుకు వస్తుందన్నారు. రాష్ట్భ్రావృద్ధికి కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఉండాల్సిందే ఇందులో మరోమాటలేదన్నారు. ఇక్కడ ఏ ఒక్కరూ రాష్ట్రం విడిపోవాలని కోరుకోనందుకే విభజన చట్టంలో వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీలు, పోలవరం ప్రాజెక్టు, లోటు బడ్జెట్ పూర్తి విశాఖలో రైల్వే జోన్ వంటి అంశాలన్నింటినీ తుచ తప్పక అమలు చేయాల్సిందేనని చంద్రబాబు అన్నారు. పలు పన్నుల రూపేణా రాష్ట్రం నుంచి కోట్లకు కోట్లు దండుకుంటున్న కేంద్రం సహాయపడకపోతే ఎవరు సహాయపడతారని ప్రశ్నించారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందితే కస్టమ్స్, ఎక్సైజ్ పన్నులు ఆదాయపు పన్ను పేరిట కేంద్రానికే రాబడి పెరుగదాయని అన్నారు. వరదలు భారీ వర్షాల వల్ల నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలు అతలాకుతలమయ్యాయంటూ తక్షణ సహాయంగా వెయ్యి కోట్లు కోరటం జరిగిందన్నారు. తక్షణం తమిళనాడుకు అడ్వాన్స్ ఇచ్చి కేంద్ర బృందాలు వచ్చినప్పటికీ రాష్ట్రానికి కూడా అదే రీతిలో సహాయం అందగలదని తాను భావిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు.