రాష్ట్రీయం

హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/చార్మినార్, సెప్టెంబర్ 12: బక్రీద్, గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్‌లో హై అలర్ట్ ప్రకటించారు. సోమవారం నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి, పోలీసు అధికారులతో కలసి పాతబస్తీలో పర్యటించారు. సోమవారం బక్రీదు పర్వదినాన్ని పురస్కరించుకొని ఈద్గా, మసీదులలో జరిగే సామూహిక ప్రార్థనలకు ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేసినట్టు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. ఈద్గా, మసీదులు, గణేశ్ మండపాల వద్ద భద్రత ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. పండగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 12వేల మంది పోలీసులు మరో 8వేల మంది అదనపు భద్రతా దళాలు నగరంలో గస్తీ నిర్వహిస్తాయని, నగరవ్యాప్తంగా 12వందల సిసి కెమెరాలను ఏర్పాటు చేశామని, పోలీస్ కంట్రోల్ రూం ద్వారా వీటి పర్యవేక్షణ ఉంటుందని కమిషనర్ చెప్పారు. గత సంవత్సరం సుమారు 65వేల వరకు గణేశ్
విగ్రహాల నిమజ్జనం జరిగిందని, ఈ యేడు 70వేల వరకు విగ్రహాల నిమజ్జన జరగొచ్చని కమిషనర్ అంచనా వేశారు. కాగా ఈనెల 15న ఒక రోజు దాదాపు 15వేల విగ్రహాలు నిమజ్జనానికి తరలి రావచ్చని చెప్పారు. గురువారం ఉదయం గం. 6.00 నుంచే విగ్రహాలు నిమజ్జనం కానున్నాయని, నిమజ్జనం సందర్భంగా నిఘా వర్గాల నుంచి ఎలాంటి హెచ్చరికలు లేవని కమిషనర్ తెలిపారు. పుకార్లు నమ్మవద్దని, సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనల పట్ల హైరానా చెందవద్దన్నారు. గణేశ మండపాలు, ప్రార్థన స్థలాల వద్ద అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఎవరికైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కమిషనర్ మహేందర్‌రెడ్డి కోరారు. ఎవరైనా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి హెచ్చరించారు.

చిత్రం.. పాతబస్తీలో పెద్దఎత్తున మోహరించిన భద్రతా బలగాలు