రాష్ట్రీయం

స్విస్ చాలెంజ్‌పై అప్పీల్‌ను స్వీకరించిన హైకోర్టు విచారణ నేటికి వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 15: స్విస్ చాలెంజ్‌పై హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను హైకోర్టు ధర్మాసనం విచారణకు స్వీకరించింది. అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ గురువారం ధర్మాసనం ఎదుట వాదనలు వినిపిస్తూ, అమరావతి రాజధాని నగరంలో అభివృద్ధి అనే అంశాన్ని రియల్ ఎస్టేట్ కోణంలో చూడరాదన్నారు. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ యు దుర్గా ప్రసాదరావుతో కూడిన ధర్మాసనం ఈ వాదనలను విచారించింది. ఏపి ఏజి శ్రీనివాస్ వాదనలు కొనసాగిస్తూ, రోడ్లు వేసిన తర్వాత, భవనాలు నిర్మించిన తర్వాత మాత్రమే బిల్టప్ ఏరియాను కన్సార్టియం కంపెనీ విక్రయిస్తుందన్నారు. ఈ తరహా ప్రాజెక్టుల్లో సింగపూర్‌కు చెందిన కన్సార్టియంకు మంచి అనుభవం ఉందని, ఈ తరహా ప్రాజెక్టులను గతంలో చేపట్టారన్నారు. టెండర్లలో అర్హత సంపాదించిన కంపెనీలకు మాత్రమే సింగపూర్ కన్సార్టియం ఆఫర్ చేసిన రెవెన్యూ వాటాల వివరాలను వెల్లడిస్తామన్నారు. ఈ కేసులో పిటిషనర్లకు అర్హత లేదన్నారు. రెవెన్యూ వాటాల వివరాలు వెల్లడించాలన్న నిబంధన చట్టంలో లేదని, కాని రెవెన్యూ వివరాలను ఎందుకు ప్రచురించలేదని హైకోర్టు సింగిల్ జడ్జి ఈ విషయాన్ని తప్పుబట్టారని ఆయన హైకోర్టుకు తెలిపారు. టెండర్ల ప్రక్రియలో సాంకేతిక అర్హత ప్రాతిపదికన ఎంపికైన కంపెనీలకు మాత్రమే సింగపూర్ కన్సార్టియం ఆఫర్ చేసిన రెవెన్యూ వాటాల వివరాలను వెల్లడిస్తామని ఆయన కోర్టుకు వివరణ ఇచ్చారు. విదేశీ కంపెనీలకు చెందిన సంస్థలు బిడ్డర్లుగా ఉంటే వర్తించే షరతులపై వివరాలు కావాలని హైకోర్టు అడిగింది. కాగా ఈ అంశంపై దాఖలైన పిటిషన్లలో విచారణకు యోగ్యమైన వివరాలు లేవని ఏజి హైకోర్టుకు తెలిపారు. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని ఎన్ని కంపెనీలు అమరావతి రాజధాని అభివృద్ధికి ముందుకు వచ్చాయో తెలియచేయాలని కోరింది. అనంతరం ఈ కేసు విచారణ శుక్రవారం కూడా కొనసాగుతుందని హైకోర్టు ప్రకటించింది.