రాష్ట్రీయం

బొజ్జా తారకం కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: దళిత నేత, సీనియర్ న్యాయవాది, రిపబ్లికన్ పార్టీ వ్యవస్థాపకుడు బొజ్జా తారకం శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. తూర్పు గోదావరి జిల్లా కందికుప్ప గ్రామంలో 1939 జూన్ 27న జన్మించారు. నాటి కారంచేడు ఊచకోత నుంచి ఇటీవలి లక్సింపేట మారణకాండ వరకు బొజ్జా తారకం అత్యంత క్రియాశీలకమైన రీతిలో పోరాటాలు సాగించారు. 80-90 దశకాల్లో జరిగిన దళిత సాహితీ ఉద్యమానికి ముందే ఆయన ‘నది పుట్టిన గొంతుక’ అనే కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు. కవిగా, రచయితగా, న్యాయవాదిగా బొజ్జా తారకం బహుముఖ సేవలందించారని, అణగారిన వర్గాల అభ్యున్నతికి జీవితాంతం కృషి చేశారని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ పలుమార్లు న్యాయపోరాటం చేసి తమకు అండదండలు అందించారని ఆయన గుర్తుచేసుకున్నారు.