రాష్ట్రీయం

చెన్నై ఐఐటికి జెఇఇ-2017 బాధ్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 16: దేశంలోని 19 ఐఐటిలతో పాటు 31 ఎన్‌ఐటిలు ఇతర జాతీయ ఉన్నత స్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం జెఇఇ-2017ను నిర్వహించే బాధ్యతను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ చెన్నై ఐఐటికి అప్పగించింది. నోటిఫికేషన్ మొదలు పరీక్ష ప్రశ్నాపత్రం రూపకల్పన, ఫలితాల ప్రకటన వరకూ అన్ని బాధ్యతలను ఐఐటి చెన్నై చూసుకుంటుంది. త్వరలోనే పరీక్ష నిర్వహణ కమిటీ సమావేశం కాగానే ప్రాథమిక షెడ్యూలును విడుదల చేస్తుంది. అనంతరం సవివర ప్రకటనను జారీ చేస్తుంది. అభ్యర్థుల రిజిస్ట్రేషన్, ఫీజులు, పరీక్ష, ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని ఇస్తుంది. పరీక్ష నిర్వహణ, అడ్వాన్స్ పరీక్ష నిర్వహణ, కీ రూపకల్పన , వౌలిక సదుపాయాల కల్పన, పరీక్ష కేంద్రాల ఎంపిక , సజావుగా పరీక్ష నిర్వహణకు సంబంధించిన నిర్ణయాలను కూడా ఐఐటి చెన్నై చూసుకుంటుంది.
2017 నుండి అభ్యర్థులు అంతా అప్టిట్యూడ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. అభ్యర్థి మానసిక విశే్లషణ ఆలోచనాత్మక శక్తిసామర్థ్యాలను ఈ పరీక్ష ద్వారా అంచనా వేస్తారు. అభ్యర్థులు ఈ పరీక్షను ముందుగా రాసుకునేందుకు కూడా అవకాశం కల్పించే వీలుందని తెలిసింది. త్వరలో కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటే ఏడాదికి ఒక్కసారి నిర్వహించాలా లేదా అంతకంటే ఎక్కువ సార్లు నిర్వహించాలా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు. దేశంలోని 31 ఎన్‌ఐటిలు, 19 ఐఐటిలు ఇతర జాతీయ సంస్థలలో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజీని తొలగిస్తూ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అపెక్స్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది.
ప్రతి అభ్యర్థి 75 శాతం మార్కులు సాధించడంతో పాటు ఆయా రాష్ట్రాల్లోని 20 శాతం పర్సెంటైల్ జాబితాలో ఉంటేనే ఐఐటిల్లో చేరేందుకు అర్హులు అవుతారు. అలాగే ఆప్షనల్ సబ్జెక్టుల్లో కనీసం 45 శాతం ఉత్తీర్ణత ఉండాలి. 2016 ఐఐటి జెఇఇని గౌహతి ఐఐటి నిర్వహించిన విషయం విధితమే.
లక్షకు పెంపు
దేశవ్యాప్తంగా అన్ని సెంట్రల్ యూనివర్శిటీలు, 19 ఐఐటిల్లో సీట్లను రానున్న ఐదేళ్ల వ్యవధిలో కనీసం లక్షకు పెంచాలని లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ప్రతి ఏటా కనీసం 20 శాతం సీట్లు చొప్పున పెంచుతారు. ప్రస్తుతం ఐఐటిల్లో 10,500 సీట్లు ఉన్నాయి. ఐఐటి జెఇఇ-2016 మెయిన్స్‌కు 11.28 లక్షల మంది హాజరుకాగా, అడ్వాన్స్ పరీక్షకు 1,47,678 మంది హాజరయ్యారు. తుదకు 36,566 మంది అర్హత సాధించారు.