రాష్ట్రీయం

పాలమూరు, డిండిపై ధ్వజమెత్తుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 17: కృష్ణా జలాలపై తలెత్తిన వివాదంపై ఈ నెల 21న ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరగనున్న అత్యున్నతి మండలి సమావేశంలో బలంగా వాదనలు వినిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమాయత్తమవుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర సాగునీటి ప్రయోజనాలపై రాజీపడకుండా స్పష్టమైన వైఖరిని వెల్లడించాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ దిశగా ఆయన గత రెండు రోజులుగా జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, సాగునీటి నిపుణులతో చర్చిస్తున్నారు. ఐదు పాయింట్ల ఫార్ములాతో వాదనలను వినిపించాలని, ఈ విషయంలో వెనక్కు తగ్గే ప్రసక్తిలేదని చంద్రబాబు ఉన్నతాధికారులకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో పేర్కొన్నట్లుగా తక్షణమే రెండు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై నిర్మించిన అన్ని ప్రాజెక్టుల పర్యవేక్షణ బాధ్యతలను కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డుకు అప్పగించాలన్నది ఆంధ్ర రాష్ట్ర డిమాండ్‌ను బలంగా వినిపించనున్నారు. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల నిర్వహణను కృష్ణాబోర్డు తీసుకోవాలని ప్రతిపాదనను అమలు చేయాలని కోరనున్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నది నీటిని కృష్ణా నదిలోకి మళ్లించినందువల్ల తమకు 80 టిఎంసి నీటి వాటా ఉందని, ఆ నీటిని ఎగువ నున్న కృష్ణా ప్రాజెక్టుల్లో నీటిలో పట్టుకుంటామని తెలంగాణ వాదిస్తోంది. ఈ వాదనను తిప్పిగొట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు ఒప్పందం ప్రకారం ఎగువ రాష్ట్రాలకు కేటాయించనున్న 80 టిఎంసి నీటిని ఇవ్వలేమని స్పష్టం చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువున బ్యాక్ వాటర్‌ను తోడుకునేందుకు రంగారెడ్డి-పాలమూరు, డిండి ఎత్తిపోతల స్కీంలను నిర్మిస్తున్నారని, వీటిని అడ్డుకోవాలని కేంద్రానికి చంద్రబాబు బలమైన వాణిని వినిపించనున్నారు. వీటికి అనుమతులు లేవని ఏపి సర్కార్ భావిస్తోంది.