రాష్ట్రీయం

సచివాలయం నుంచే ఇక సిఎం సమీక్షలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 18: విజయదశమి తరువాత నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడి సచివాలయం నుంచే పూర్తిస్థాయిలో తన విధులను నిర్వర్తించబోతున్నారు. ఇందుకుగాను ఆయన ఆదివారం తన నివాస గృహంలో పురపాలక మంత్రి నారాయణ, సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, ఇతర అధికారులతో సమావేశమయ్యారు. మొదటి బ్లాక్‌లోని సిఎం చాంబర్‌కు ఆనుకుని ఉండేలా కమాండ్ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇక అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌లతో పాటు సిసి కెమెరాలు, డ్రోన్‌లు సహాయంతో వివిధ జిల్లాల బాధ్యులతో సమీక్షలు నిర్వహించేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సమీక్షించనున్నారు. నేరుగా డ్రోన్‌లకు అమర్చిన కెమెరాలతో ఆయా జిల్లాల్లోని పరిస్థితులను, అలాగే పంటల పరిస్థితులను కూడా స్వయంగా సమీక్షించనున్నారు. ఆరో బ్లాక్‌లో శాసనసభ, శాసనమండలిని ఏర్పాటు చేయనుండగా మిగిలిన ఐదు బ్లాక్‌లకు భిన్నంగా ప్రత్యేకత ఉట్టిపడేలా ఆ బ్లాక్ నిర్మాణం జరగాలని కూడా సిఎం ఆదేశించారు. ఈనెల 21 నుంచి దశలవారీగా రాజధానికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల పంపిణీ ప్రక్రియ చేపట్టాలని కూడా సిఎం ఆదేశించారు.