రాష్ట్రీయం

‘అనంత’లో హెల్త్ ఎమర్జెన్సీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, సెప్టెంబర్ 18 : అనంతపురం నగరంలో డెంగ్యూ వ్యాధికి గురై ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన నేపథ్యంలో నగరంతోపాటు జిల్లావ్యాప్తంగా హెల్త్ ఎమర్జెన్సీ విధించారు. జిల్లా కలెక్టర్ కోన శశిధర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్, పబ్లిక్ హెల్త్ శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. మూడోవ రోజు ఆదివారం కూడా కలెక్టరేట్‌లో వరుస సమీక్షలు జరిగాయి. హెల్త్ ఎమర్జెన్సీ నేపథ్యంలో నగర పాలక సంస్థతోపాటు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఆర్‌ఎంపి క్లినిక్‌లను సీజ్ చేశారు. పరిస్థితి అదుపులోకి వచ్చేవరకూ మరో రెండు రోజులపాటు వీటిని మూసి ఉంచేలా జిల్లా యంత్రాంగం ఆదేశాలు చేసింది. డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, చికున్‌గన్యా వ్యాధులతోపాటు డయేరియాపై కలెక్టర్ కోన శశిధర్, జాయింట్ కలెక్టర్లు లక్ష్మీకాంతం, సయ్యద్ ఖాజామొహిద్దీన్, డిఎంఅండ్‌హెచ్‌ఓ వెంకటరమణ, పబ్లిక్ హెల్త్ జిల్లా అధికారులతో సమావేశమై సమీక్షించారు. అలాగే అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న పందులను యుద్ధ ప్రాతిపదికన నగర శివార్లకు తరలించే చర్యలు ముమ్మురం చేశారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, మున్సిపల్ ఆరోగ్య విభాగం అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు నగరంలోని పలు మురికివాడల్లో పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేశారు. దీనికితోడు ఆదివారం అనంతపురానికి చేరుకున్న డిఎంఎ కన్నబాబుతో కలిసి కలెక్టర్ కలెక్టరేట్‌లో నియోజకవర్గాల వారీ ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్‌ను సందర్శించారు. అనంతరం డిఎంఎ నగరంలో పర్యటించి పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, క్లినిక్‌లలో వ్యాధిగ్రస్థుల వివరాల నివేదికలను తెప్పించుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు.

చిత్రం.. అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో జ్వరపీడిత చిన్నారులు,
వారి తల్లులతో కిటకిటలాడుతున్న చిన్నపిల్లల వార్డు