రాష్ట్రీయం

కోటి ఇళ్లకు నల్లా నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: అన్ని గ్రామాలకు వచ్చే డిసెంబర్ నాటికి మంచినీరు అందించేలా మిషన్ భగీరథ పనులు వేగవంతం చేయాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. దాదాపు కోటి ఇళ్లకు నల్లాల ద్వారా మంచినీరు అందించాలన్నది లక్ష్యంగా నిర్దేశించారు. క్యాంపు కార్యాలయంలో ఆదివారం మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ ఈఎన్‌సి సురేందర్‌రెడ్డి, సిఇలు సురేశ్‌కుమార్, జగన్మోహన్‌రెడ్డి, కృపాకర్‌రెడ్డి తదితరులతో సిఎం సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ ద్వారా నదుల నీళ్లు గ్రామాలకు చేరే నాటికి ఓవర్ హెడ్ ట్యాంక్‌లు, అంతర్గత పైపులైన్ల పనులు పూర్తి కావాలని ఆదేశించారు. నీటిపారుదల ప్రాజెక్టుల నుంచి మంచినీటి కోసం పది శాతం నీటిని వినియోగించుకునేలా చట్టాన్ని రూపొందించామన్నారు. దానికి అనుగుణంగా రిజర్వాయర్ల నుంచి నీటిని వాడుకోవాలన్నారు. పాత ప్రాజెక్టులతోపాటు కొత్తగా నిర్మిస్తున్న కాళేశ్వరం, పాలమూరు, డిండి తదితర ప్రాజెక్టుల రిజర్వాయర్ల నుంచి నీటిని వాడుకుంటామన్నారు. ఏ రిజర్వాయర్ నుంచి ఎంత నీటిని ఎక్కడి నుంచి వాడుకోవాలో స్పష్టత ఇచ్చేందుకు ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా నీటిపారుదల మంత్రి హరీశ్‌రావుకు సమీక్ష సమావేశం నుంచే ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ విషయంలో నీటిపారుదల శాఖ, మిషన్
భగీరథ అధికారులు సంయుక్తంగా సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. మిషన్ భగీరథలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలో 66,800 ఇళ్లకు నల్లాలు పెట్టి ప్రస్తుతం మంచినీరు అందిస్తుండగా, గతంలో చేసిన ప్రయత్నాలతో సిద్దిపేట నియోజకవర్గానికీ నీళ్లు అందుతున్నాయన్నారు. ఇన్‌టేక్ వెల్స్, వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, ఎలక్ట్రో మెకానికల్ పనులు, పైపులైన్ల నిర్మాణం వేగవంతంగా జరగాలని ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న పనుల వేగంపట్ల సిఎం సంతృప్తి వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి అన్ని గ్రామాలకు నీరు చేరుకుంటుందని, అప్పటి వరకు గ్రామాల్లో మంచినీటి సరఫరా వ్యవస్థను సిద్ధంగా ఉంచాలని సిఎం ఆదేశించారు. గ్రామాల్లో ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకుల నిర్మాణం, అంతర్గత పైపులైన్ల నిర్మాణం, ఇళ్లలో నల్లాలు బిగించే పనులపై దృష్టి సారించాలన్నారు. మిషన్ భగీరథ పనులను చేపట్టిన ఏజెన్సీలు పదేళ్ల వరకు నిర్వహణ బాధ్యతలు చూడాలన్న నిబంధన పెట్టడంవల్ల పనులలో నాణ్యత ఉంటుందన్నారు. మున్సిపాల్టీలు, నగర ప్రాంతాల్లో పబ్లిక్ హెల్త్‌శాఖ తరఫున మంచినీటి సరఫరా జరుగుతుందని, కొత్తగా నగర పంచాయతీలుగా మారిన ప్రాంతాల్లో ఆర్‌డబ్ల్యుఎస్ ద్వారానే నీటి సరఫరా చేయాలని సిఎం కెసిఆర్ ఆదేశించారు.

చిత్రం.. మిషన్ భగీరథపై ఉన్నతాధికారులతో సిఎం క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహిస్తున్న కెసిఆర్