రాష్ట్రీయం

తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు ప్రజలు మాత్రం గతాన్ని మరచి అన్నదమ్ముల్లా కలసిమెలిసే ఉంటున్నారని తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం నాడిక్కడ జరిగిన ఓ వివాహానికి హాజరైన మంత్రి నాయిని తనను కల్సిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ముఖ్యమంత్రులు చంద్రబాబు, కెసిఆర్ ఇద్దరూ కూడా గతాన్ని మరచి కలిసిమెలిసి సమస్యలను పరిష్కరించుకుంటూ పోతుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనమన్నారు. అయితే చంద్రబాబు మాత్రం అప్పుడప్పుడు తమకు వ్యతిరేకంగా మాట్లాడుతూ గిల్లికజ్జాలు పెట్టుకుంటున్నారంటూ వాపోయారు. ఒకసారి విడిపోయాం మళ్లీ కలువబోం కదా అన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ప్యాకేజీ ప్రకటించడం సంతోషకరమే అయినా తెలంగాణా రాష్ట్రానికి కూడా ఇతోధికంగా సహాయపడాల్సి ఉందంటూ ఎందుకో కేంద్రం తమ పట్ల వివక్ష చూపుతోందా అనే అనుమానం కల్గుతుందన్నారు. తెలంగాణాలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు మినహా ఇతర జిల్లాలన్నీ బాగా వెనుకబడే ఉన్నాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తెలంగాణాలో శాంతిభద్రతలు పటిష్ఠంగా ఉన్నాయని ‘పీపుల్స్ పోలీస్’ విధానంలో పోలీసులు ప్రజలవద్దకెళ్లి వారి సమస్యలను పరిష్కరిస్తున్నారని ఇందులో యువతను భాగస్వాములను చేస్తున్నామన్నారు. ఓటుకు నోటు, గ్యాంగ్‌స్టర్ నరుూమ్ కేసులను దర్యాప్తు అధికారులు చూస్తున్నారని వీటిపై నేను చెప్పేదేమీ లేదంటూ దాటవేశారు.