రాష్ట్రీయం

తెలుగు రాష్ట్రాల్లో హై అలర్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. ఇందులో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాల్లో భద్రత కట్టుదిట్టం చేశారు. ఎప్పుడైనా, ఎక్కడైనా ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చని అనుమానాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రధాన రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలతోపాటు విమానాశ్రయాల్లో ప్రత్యేక నిఘా పెట్టారు. తనిఖీలు చేపడతూ అనుమానితులపై గట్టి నిఘా వేసినట్టు కేంద్ర ఇంటలిజెన్స్ అధికారి ఒకరు తెలిపారు. జమ్ముకశ్మీర్‌లో జరిగిన దాడికి జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉందని ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోందని డిజిఎవో లెఫ్ట్‌నెంట్ జనరల్ రణబీర్‌సింగ్ ప్రకటించిన నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రాలో జైష్-ఎ-మహమ్మద్ కదలికలపై ఇంటలిజెన్స్ నిఘా పెట్టింది. రెండేళ్ల క్రితం హైదరాబాద్, రాజమండ్రిలో జైష్-ఎ-మహమ్మద్‌కు చెందిన కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కాగా హైదరాబాద్‌లోని చర్లపల్లి జైలులో ఖైదీలుగా ఉన్న కొందరు ఉగ్రవాద సానుభూతిపరులపై గట్టి నిఘా పెట్టినట్టు సమాచారం. ఖైదీలను కలుసుకునేందుకు ములాఖత్ పేరుతో వచ్చే వారిపై కూడా నిఘా పెంచారు. అదేవిధంగా లష్కరే తోయిబా, జైష్, ఐసిస్ ఉగ్రవాద సానుభూతిపరులున్న జైళ్లలో భద్రత కట్టుదిట్టం చేసినట్టు విశ్వసనీయ సమాచారం. శాంతిభద్రతల దృష్ట్యా తెలంగాణ సచివాలయం పరిసరాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. సోమవారం నుంచి నవంబర్ 18 వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని నగర పోలీస్ కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు.