రాష్ట్రీయం

విభజన చట్టబద్ధత.. జవాబులేని ప్రశ్న!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: ‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన రాజ్యాంగ బద్ధంగా జరిగిందా? అనేది సమాధానం లేని ప్రశ్న..’ అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. కాంగ్రెస్ మాజీ ఎంపి ఉండవల్లి అరుణ కుమార్ రాసిన ‘విభజన కథ’ పుస్తకాన్ని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ ప్రసంగిస్తూ విభజన బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందలేదని అరుణ్ కుమార్ అంటున్నారన్నారు. ఇది విడాకులు జరిగిపోయిన తర్వాత బాజాలు కొట్టినట్లు ఉందని ఆయన వ్యాఖ్యానించారు. విభజన సక్రమంగా జరిగిందా? రాజ్యాంగబద్ధంగా జరిగిందా? అనేది సమాధానం లేని ప్రశ్న అని ఆయన అన్నారు. ఈ విషయంలో అరుణ్‌కుమార్‌కు వేరే అభిప్రాయం ఉండవచ్చని అన్నారు. చరిత్ర నుంచి మానవుడు నేర్చుకున్నది ఏమీ లేదని అన్నారు. కలవడం, విడిపోవడం సహజమేనని ఆయన తెలిపారు. రాజ్యాలు, సమాజాలు కలవడం, విడిపోవడం కూడా సహజమేనని ఆయన జర్మనీని ఉదహరించారు. లోగడ రెండు పర్యాయాలు దగ్గరి వరకూ వచ్చి వెళ్ళిందని ఆయన పరోక్షంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి చెప్పారు. పొరపాట్లు మళ్లీ జరగకుండా చూసుకోవాలని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ సూచించారు.
అధిపత్యం కోసం కాదు: కెవిపి
కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచందర్ రావు ప్రసంగిస్తూ తాను తెలంగాణపై అధిపత్యం కోసమో, అనుచరులుగా ఉండాలనో భావించి సమైక్యాంధ్ర కోసం పోరాటం చేయలేదని, తెలుగు ప్రజలు కలిసి ఉండాలన్న ఆకాంక్షతో చేసినట్లు ఆయన తెలిపారు. నాయకులు ప్రజలందరినీ మభ్య పెడుతున్నారన్న అభిప్రాయం సమాజంలో కలగడం దురదృష్టకరమని అన్నారు.
తెలంగాణకు వ్యతిరేకం కాదు: ఉండవల్లి
మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రసంగిస్తూ తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు వ్యతిరేకం కాదని అన్నారు. అయితే విభజన జరిగిన తీరే బాధ కలిగించిందని ఆయన పునరుద్ఘాటించారు. విభజన బిల్లును లోక్‌సభ ఆమోదించే ముందు సభ ద్వారాలు మూసి వేయడం, టివీల్లో ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపి వేయడం పట్ల ఆయన అభ్యంతరం తెలిపారు. సభలో ఇలాగే పాలక, ప్రతిపక్షాలు రెవెన్యూ స్థలాలను తీసేసుకుందామనుకుంటే అడ్డుకునేదెవరు? అని ఆయన ప్రశ్నించారు. కాబట్టి భవిష్యత్తులో ఇటువంటివి పునరావృత్తం కారాదనేదే తన ఆరాటమని అన్నారు. దీనిపై ఇంకా చర్చ జరగాలని అన్నారు.
సాక్షి పత్రిక ఎడిటోరియల్ డైరెక్టర్ కె. రామచంద్రమూర్తి మాట్లాడుతూ విభజన బిల్లు ఆమోదం పొందలేదన్న అరుణ్ కుమార్ ఆవేదనకు ఇది అక్షర రూపం అని తెలిపారు. ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ ప్రసంగిస్తూ విభజన వల్ల తెలంగాణకు లాభం జరిగిందని, ఆంధ్రకు నష్టం జరిగిందన్న భావన ఉందని అన్నారు. సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వర రావు ప్రసంగిస్తూ ఈ పుస్తకం వల్ల ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయని చెప్పారు. ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మోహన్‌కందా, రిటైర్డ్ ఐఎఎస్ అధికారి పివిఆర్‌కె ప్రసాద్, సీనియర్ పాత్రికేయులు కె. శ్రీనివాస్ రెడ్డి, దేవులపల్లి అమర్, జ్వాలా నరసింహారావు, బండారి శ్రీనివాస్, కృష్ణారావు, రిటైర్డ్ డిజిపి అరవింద్ రావు, ఎమెస్కొ విజయ్‌కుమార్, చంద్రశేఖర్ రెడ్డి కూడా ప్రసంగించారు. సీనియర్ పాత్రికేయుడు ఎబికె ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ఉండవల్లి అరుణ్ కుమార్ రాసిన పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న జస్టిస్ జాస్తి చలమేశ్వర్