రాష్ట్రీయం

30మంది పోలీసులకు నోటీసులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 18: గ్యాంగ్‌స్టర్ నరుూం కేసు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నరుూంతో లింకులున్న 30 మంది పోలీసులకు నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది. వీరిలో ఎస్సై, సిఐ, డిఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయిలో అధికారులు ఉన్నారు. వీరంతా నల్గొండ, సైబరాబాద్, హైదరాబాద్‌లో పనిచేసిన, పనిచేస్తున్న వారు ఉన్నట్టు ఓ సీనియర్ సిట్ అధికారి తెలిపారు. అదేవిధంగా నల్గొండ, హైదరాబాద్‌కు చెందిన మరో 8 మంది రాజకీయ నాయకులకు కూడా నోటీసులు జారీ కానున్నాయి. ఇప్పటికే నల్గొండ జిల్లాలో ఇద్దరు ఎంపిపిలు, ఓ కార్పొరేటర్ పోలీసుల అదుపులో ఉన్నారు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్సీపై ఎఫ్‌ఐఆర్ నమోదైన సంగతి తెలిసిందే.
తాజాగా ఆదివారం నరుూం ముఖ్య అనుచరుడు శేషన్న డ్రైవర్ నర్సింహతోపాటు రాజు అనే అనుచరుడిని పోలీసులు అరెస్టు చేశారు. శేషన్న కోసం అధికారులు ముమ్మరంగా గాలిస్తున్నారు. నరుూం ఎన్‌కౌంటర్‌లో హతమై నలభై రోజులు గడుస్తున్నా అతని అనుచరుల అరాచకాలు వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా ఓ ఎన్నారై దుబాయి నుంచి ఫిర్యాదు చేయడమే ఇందుకు ఉదాహరణ. వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నా.. కేసులు మాత్రం 99వరకు నమోదయ్యాయి. నల్గొండలో నరుూం టాక్స్ వసూళ్లు, భువనగిరి, పటాన్‌చెరులోని భూములు ఖాళీ చేయాలంటూ బెదిరింపులు, క్రాంతిసేన పేరిట నరుూంది బూటకపు ఎన్‌కౌంటర్ అని, టిఆర్‌ఎస్ నేతలను వదిలిపెట్టేది లేదంటూ బెదిరింపు లేఖలు వంటి అరాచకాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఓ వైద్యుడు ఆసుపత్రి వ్యాపారం వివాదంలో తనను బెదిరించి రూ. 50 లక్షలు ఇచ్చేది ఉన్నట్టుగా అప్పు నోటు పత్రాన్ని నరుూం అనుచరులు రాయించుకున్నారని, తనకు న్యాయం చేయాలంటూ రమేష్‌గౌడ్ అనే వ్యక్తి దుబాయి నుంచి రాచకొండ కమిషనర్, సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాని బాధితులు ఎవరైనా భయాందోళనకు గురైతే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సిట్ అధికారులు పేర్కొన్నారు.