ఆంధ్రప్రదేశ్‌

రేషన్ కార్డుకూ గతిలేదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: కొద్దిరోజులుగా దేశంలో ప్రతి ఒక్కరూ ఒలింపిక్స్ ఫలితాలపైనే చర్చించుకుంటున్నారు. అరకొర పతకాలు సాధించిన వారికి, తృటిలో పతకం కోల్పోయిన వారికీ క్రీడా సంఘాలు, ప్రభుత్వాలు కోట్లాది రూపాయలను పారితోషికాలుగా అందజేశాయి. ఈనేపథ్యంలోనే పేదరికంతో తల్లడిల్లుతూ కనీసం రేషన్‌కార్డుకు కూడా నోచుకోని తొలి ఒలింపియన్ స్విమ్మర్ గుంటూరు జిల్లా రేపల్లె ప్రాంతానికి చెందిన షంషేర్ ఖాన్ దయనీయ స్థితి వెలుగులోకి వచ్చింది. ‘యూత్ వెల్ఫేర్’ సంస్థ ఆధ్వర్యంలో షంషేర్ ఖాన్‌ను సోమవారం నగరానికి తీసుకొచ్చి ఆయన దుస్థితిని మీడియాకు వివరించారు. క్రీడారంగంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎనలేని ఆసక్తి చూపుతున్నందున షంషేర్ ఖాన్‌ను గుర్తించి అర్జున అవార్డుతో సత్కరించాలని ఆ సంస్థ ప్రతినిధులతో పాటు మాస్టర్స్ స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. 125 కోట్ల మంది జనాభాలో అరకొర పతకాలతో సంబరపడిపోయే పరిస్థితి వుంది గాని వాస్తవానికి క్రీడల పట్ల ఆసక్తి కలిగినవారు రాణించలేక పోవటానికి కూడా అనేక కారణాలు ప్రస్ఫుటవౌతున్నాయి. 1956లో మెల్‌బోర్న్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో పాల్గొని ఐదో స్థానంలో నిలిచిన షంషేర్‌ఖాన్ నాడు ప్రశంసలు పొందినప్పటికీ నేడు ఎలాంటి గుర్తింపునకు నోచుకోక ఫకీరులా మారిపోయాడు. కులబలం, దానికి మించి లాబీయింగ్ లేకపోవటం వల్లనే ఆయనకు గుర్తింపు లభించలేదని యూత్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడు ఫారూఖ్ షుబ్లీ విమర్శించారు. వెయిట్ లిఫ్టింగ్‌లో, అథ్లెటిక్స్‌లోనూ పతకాలు రానివారు సైతం 10 తరువాత స్థానాల్లో వున్నప్పటికీ కేవలం లాబీయింగ్‌తోనే అర్జున అవార్డు దక్కించుకున్నారనే ఆరోపణలూ ఉన్నాయి. కృష్ణా జిల్లాకు చెందిన కామినేని ఈశ్వరరావు కుస్తీ విభాగంలో 11వ స్థానం దక్కించుకుని అర్జున అవార్డును దక్కించుకున్న వైనాన్ని ఈసందర్భంగా గుర్తుచేస్తున్నారు. ఆర్మీలో నాయక్ సుబేదార్‌గా దేశ రక్షణ విధులు నిర్వర్తిస్తూనే 1956లో జరిగిన తొలి ఒలింపిక్స్‌లో దేశం తరపున షంషేర్ ఖాన్ ప్రాతినిథ్యం వహించారు. 1954లో నమోదైన జాతీయ స్థాయి స్విమ్మింగ్ రికార్డులను మరుసటి సంవత్సరం బెంగుళూరులో జరిగిన నేషనల్ మీట్‌లో ఆయన బద్దలు కొట్టారు. అయినప్పటికీ ఏ ప్రభుత్వం నుంచి కూడా సముచిత గుర్తింపు లభించలేదు. 1962 ఇండో-చైనా యుద్ధంలో, 1971 బంగ్లాదేశ్ తరపున పాకిస్తాన్‌పై జరిపిన పోరాటంలోనూ ఆయన పోషించిన పాత్రకు కాగితపు ప్రశంసలు దక్కాయే కానీ జీవితానికి సరిపడా భద్రత లభించలేదనేది ఆయన మనోవేదన. ప్రస్తుతం 86వ ఏట ఆయన పేదరికంతో కేవలం గతంలో ఆర్మీలో పనిచేసినందుకు వచ్చే కొద్దిపాటి పెన్షన్‌తో కాలం వెళ్లదీస్తున్నారు. ఉద్యోగ విరమణ అనంతరం సైనికోద్యోగులకు రావలసిన ప్రయోజనాల్లో పెన్షన్ తప్ప తనకేమీ దక్కలేదని వాపోయారు. చట్టప్రకారం దక్కాల్సిన ఐదెకరాల భూమి కూడా దక్కలేదు. ఇదిలావుంటే స్విమ్మింగ్ అసోసియేషన్ తరపున లక్ష రూపాయల నగదు బహుమతిని, ప్రముఖ వ్యాపారవేత్త, జాతీయ వాలీబాల్ క్రీడాకారుడు, క్రెసంట్ రియల్ ఎస్టేట్ యజమాని ఖాదర్ బాషా మరో లక్ష రూపాయలు అందజేస్తామని ఫోన్ ద్వారా తెలిపారని ఫారూఖ్ షుబ్లీ చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు షంషేర్ ఖాన్‌ను గుర్తించి ఆదుకోవాలని స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి లక్ష్మీనారాయణరెడ్డి, అధ్యక్షుడు నాగేశ్వరరావు, న్యాయవాది అబ్దుల్ మతీన్, యూత్ వెల్ఫేర్ సభ్యులు కోరారు.