రాష్ట్రీయం

విశాఖలో 23నుంచి ఇండియా, ఇంటర్నేషనల్ సీఫుడ్ ఫెస్టివల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 20: విశాఖ వేదికగా మరో అంతర్జాతీయ కార్యక్రమం జరగనుంది. ఈ నెల 23 నుంచి మూడు రోజుల పాటు ఇండియా, ఇంటర్నేషనల్ సీఫుడ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. జాతీయ, అంతర్జాతీయంగా సముద్ర ఉత్పత్తుల ఎగుమతిదారులు, ఉత్పత్తిదారులు అంతర్జాతీయ సీఫుడ్ ఫెస్టివల్‌లో భాగస్వామ్యం కానున్నారు. ఎంపెడా, ది సీ ఫుడ్స్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా ఈ ఫెస్టివల్ నిర్వహించనున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు ఎం వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరి, ఎంపెడా చైర్మన్ డాక్టర్ ఎ జయతిలక్ పాల్గొంటారు. మూడు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో 200 మంది వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు సహా ఎపితో పాటు పలు రాష్ట్రాల నుంచి 2000 మంది ప్రతినిధులు హాజరుకానున్నట్టు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం తెలిపారు. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల పెంపు, ఉత్పత్తిలో అనుసరించాల్సిన పద్ధతులు, సాంకేతిక సహకారం వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చించనున్నారు. సువిశాల తీర ప్రాంతం కలిగిన నవ్యాంధ్రలో సముద్ర ఉత్పత్తుల అభివృద్ధికి సంబంధించి అంతర్జాతీయ సాంకేతిక నిపుణులతో చర్చాకార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ పేర్కొన్నారు.