రాష్ట్రీయం

బొబ్బిలిలో నావికాదళ వైమానిక స్థావరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం మరికొన్ని ప్రాజెక్టులకు, సంస్థలకు అనుమతి ఇవ్వడంతో పాటు నిధులను మంజూరు చేయాలని యోచిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రానికి స్పెషల్ ప్యాకేజీ కింద దాదాపు 2.50 లక్షల కోట్లు విడుదల చేసేందుకు వీలుగా సన్నాహాలు చేస్తోంది. ఈ నిధులు రానున్న ఐదేళ్ల వ్యవధిలో విడుదల చేస్తారు. కేవలం జాతీయ రహదారుల అభివృద్ధికి ఐదేళ్లకాలంలో మొత్తం 64వేల కోట్లు కేంద్రం ఇవ్వనుంది. అలాగే ఐదేళ్లపాటు లోటును భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు అదనంగా 22వేల కోట్లు ఇవ్వనుంది. బొబ్బిలిలో నావికాదళ వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం 3300 కోట్లు ఇవ్వనుంది. అలాగే వైజాగ్‌లో 20వేల కోట్ల వ్యయంతో మెడ్‌టెక్ సంస్థ ఏర్పాటు చేస్తారు. మరో పక్క కేంద్రం పోలవరం ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు కేంద్రం 30వేల కోట్లు అవుతుందని అంచనా వేస్తోంది. రానున్న రోజుల్లో మరో 10వేల కోట్లు వ్యయం పెరిగినా దానిని భరించాలనేది కేంద్రం సంకల్పం. ఎప్పటికపుడు జపాన్ లేదా ఇతర దేశాల నుండి రుణాన్ని పొంది ప్రాజెక్టును పూర్తి చేస్తే అందుకు అయిన వ్యయాన్ని కేంద్రం ఆయా రుణ సంస్థలకు చెల్లించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. విశాఖపట్టణంలో ఉక్కు కర్మాగారం కార్యకలాపాలను పటిష్టం చేసేందుకు మరో 32,500 కోట్లు ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా మంజూరు చేసిన 9.3 లక్షల గృహాల్లో కేవలం ఆంధ్రప్రదేశ్‌కు 1,93,142 గృహాలను కేటాయించింది. ఇంకో పక్క తాజాగా స్మార్ట్ సిటీల జాబితాలో తిరుపతిని చేర్చింది.