రాష్ట్రీయం

26న టి.కేబినెట్ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: నిజామాబాద్, కరీంనగర్ నగరాల్లో కొత్తగా పోలీస్ కమిషరేట్లను ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు మంగళవారం అధికారులను ఆదేశించారు. వీటిని ఈ నెల 26న జరుగనున్న మంత్రిమండలి సమావేశంలో ఆమోదించాలని సిఎం నిర్ణయించారు. ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్లుగా ఉన్న ఈ రెండు నగరాలలో జనాభా తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖను పటిష్ఠం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నెల 26న జరుగబోయే మంత్రిమండలి సమావేశంలో కొత్త పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుతో పాటు బిసి కమిషన్ ఏర్పాటుపై కూడా చర్చించనున్నట్టు కెసిఆర్ వెల్లడించారు.
దసరా పండుగ తర్వాతనే శాసనసభ వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని కెసిఆర్ నిర్ణయించారు. నిజానికి సెప్టెంబర్ 20 నుంచి పది రోజుల పాటు నిర్వహిస్తామని ఆగస్టు 30న జరిగిన బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో కెసిఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. దసరా నుంచి ఏర్పాటు కానున్న కొత్త జిల్లాల ఏర్పాటులో అధికారులు బిజీగా ఉండటంతో పండుగ తర్వాతనే శాసనసభ సమావేశాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్టు తెలిసింది. దసరా పండుగ తర్వాతనే శాసనసభ సమావేశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి హరీశ్‌రావు శాసనసభ కార్యదర్శి రాజా సదారామ్‌కు తెలియజేసినట్టు తెలిసింది.

చిత్రం.. ఢిల్లీలో జరగనున్న అపెక్స్ కమిటీ సమావేశానికి మంగళవారం సాయంత్రం బయలుదేరిన టి.సిఎం కెసిఆర్ చేతికి దట్టీ కడుతున్న డిప్యూటీ సిఎం మహమూద్ అలీ