రాష్ట్రీయం

విజయవాడ స్టేషన్ వెలవెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 20: ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద రైల్వే జంక్షన్ విజయవాడ స్టేషన్‌లో 150 కోట్లతో జరుగుతున్న అధునాతన సిగ్నలింగ్ వ్యవస్థ పనుల కారణంగా బుధవారం తెల్లవారుజాము నుంచి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. మంగళవారం ఉదయం నుంచే అన్ని రకాల రైళ్లను నిలిపివేయాలని నిర్ణయించినప్పటికీ అత్యధిక రైళ్లు యథావిధిగా నడిచాయి. రిజర్వేషన్ల రద్దు కారణంగా అలాగే రైళ్ల రద్దు ప్రచారంతో విజయవాడ రైల్వేస్టేషన్ ప్రయాణికులు లేక వెలవెలబోయింది. 5, 6, 7, 10 ప్లాట్‌ఫారాల్లో గతంలో ఉన్న నాన్ ఇంటర్ లాకింగ్ సిస్టంతోనే కొన్ని రైళ్లను నడపటానికి రైల్వే అధికారులు నిశ్చయించుకున్నారు. ఏది ఏమైనా 192 రైళ్లను విజయవాడ స్టేషన్‌లోకి రాకుండా, 210 రైళ్లను దారి మళ్లించి నడుపుతారు. నగర పరిసరాల్లోని గన్నవరం, మధురానగర్, రాయనపాడు, కృష్ణా కెనాల్, గుణదల రైల్వే స్టేషన్లలో 24 గంటలపాటు సాయుధ పోలీసుల నిఘా ఏర్పాటు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని యుద్ధ ప్రాతిపదికన అదనపు కౌంటర్లను కూడా ఏర్పాటు చేశారు. దొనకొండ, ఒంగోలు, నడికుడి వైపు వెళ్లే రైళ్లన్నీ కృష్ణా కెనాల్, తెనాలి, గుంటూరు స్టేషన్ల నుంచి రాకపోకలు సాగిస్తాయి. శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఖమ్మం నుంచి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ గన్నవరం నుంచి, పినాకిని కృష్ణా కెనాల్ నుంచి రాకపోకలు సాగించనున్నాయి. పరిసరాల్లోని శాటిలైట్ రైల్వేస్టేషన్లన్నింటికీ విజయవాడ నుంచి ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నారు.

చిత్రం.. యుద్ధ ప్రాతిపదికన విజయవాడ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న మరమ్మతు పనులు