రాష్ట్రీయం

నేడో రేపో భూమన అరెస్ట్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 20: తుని అల్లర్ల ఘటనలో ప్రమేయం ఉందన్న ఆరోపణపై వైఎస్సార్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని సిఐడి అధికారులు మంగళవారం మరోసారి విచారించారు. తొలిసారిగా ముద్రగడతో సంప్రదింపులకు సంబంధించిన కాల్‌డాటాపై ప్రశ్నలు సంధించిన సిఐడి అధికారులు మంగళవారం రెండోవిడత విచారించిన అనంతరం ఆయనను అరెస్టుచేసే అవకాశాలు ఉన్నాయని పార్టీనేతలు భావించారు. భూమన గుంటూరులో సిఐడి కార్యాలయానికి చేరుకునే ముందు పార్టీ సీనియర్ నాయకులు అంబటి రాంబాబు, అప్పిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, ఇతర జిల్లా నాయకులు పార్టీ కార్యాలయంలో ఆంతరంగికంగా సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఒకవేళ అరెస్టు జరిగితే ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు. ఉదయం 10.30 గంటలకు భూమనతో సహా వైసిపి నాయకులంతా సిఐడి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. సిఐడి అదనపుఎస్పీ రామకృష్ణ నేతృత్వంలో అధికారులు విచారణకు ఉపక్రమించారు. అదే సమయంలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. భూమనకు ఎలాంటి హాని తలపెట్టినా ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. అయితే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని కొద్దిసేపటి అనంతరం వదిలేశారు. సాయంత్రం వరకు భూమన బయటకు రాకపోవడంతో వైసిపి నాయకులు ఆందోళనకు ఉపక్రమించారు. తిరుపతికి చెందిన పలువురు కార్యకర్తలు గుంటూరు సిఐడి కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో విచారణ అనంతరం భూమన సిఐడి కార్యాలయం నుంచి బయటకు రావడంతో కార్యకర్తలు పెద్దఎత్తున హర్షధ్వానాలు
చేశారు. అల్లర్లు జరిగిన రోజున కాపునేత ముద్రగడతో భూమన ఎన్నిసార్లు ఫోన్లో మాట్లాడింది.. ఆ తరువాత వైసిపి కార్యకర్తలతో మాట్లాడారా.. ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నాలు ఏవైనా జరిగాయా అనే అంశాలపై సిఐడి అధికారులు భూమనను ప్రశ్నించినట్లు తెలియవచ్చింది. ఆరోజు ముద్రగడ ఎక్కడ ఉన్నదీ ఎవరెవరితో మాట్లాడింది కాల్‌డాటాను కూడా సిద్ధం చేసుకుని మరీ ప్రశ్నలవర్షం కురిపించినట్లు సమాచారం. రెండోవిడత విచారణ ముగిసిన అనంతరం మరోసారి విచారణకు హాజరు కావాలని సిఐడి అధికారులు సూచించినట్లు చెబుతున్నారు. అయితే ఆయన్ను ఏ క్షణానైనా అరెస్టుచేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల క్రితమే భూమనను అరెస్టుచేయాలని భావించినా శాసనసభ సమావేశాల దృష్ట్యా ఆ ప్రయత్నాన్ని పోలీసు అధికారులు విరమించుకున్నట్లు చెబుతున్నారు. విచారణ తుది దశకు చేరుకోవడంతో భూమన అరెస్టుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
నాకేం సంబంధం లేదు:్భమన
తుని సంఘటనతో తనకు ఏం సంబంధం లేదని, తాను ఏ తప్పూ చేయలేదని, ఎవరికీ భయపడేది లేదని భూమన కరుణాకరరెడ్డి స్పష్టం చేశారు. సిఐడి అధికారులు ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతానన్నారు. గుంటూరులో సిఐడి విచారణకు హాజరైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాపు ఉద్యమానికి తాను నైతిక మద్దతు మాత్రమే ఇచ్చానని, అయితే ఉద్దేశపూర్వకంగా తనను కేసులో ఇరికించారని, తనను అరెస్ట్ చేసినట్లయితే ప్రత్యక్షంగా కాపు ఉద్యమంలోకి వెళతానని స్పష్టంచేశారు. తుని కేసులో తమ పార్టీ నేతలను ఇరికించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ముందుగా ఈకేసులో చంద్రబాబునాయుడుకు నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని డిమాండ్ చేశారు.

చిత్రం.. సిఐడి విచారణ అనంతరం బయటకు వస్తున్న భూమన