రాష్ట్రీయం

డిస్కంల భారం ప్రభుత్వానిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 20: నవ్యాంధ్రప్రదేశ్‌లో విద్యుత్ పంపిణీ సంస్థలు రూ. 11 వేల కోట్ల మేర రుణభారం మోస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ జి భవానీప్రసాద్ పేర్కొన్నారు. ఎపిఈపిడిసిఎల్ కార్పొరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం మోయనుందన్నారు. ఉజ్వల్ డిస్కం ఏస్యూరెన్స్ యోజన (ఉదయ్) వచ్చిన తరువాత విద్యుత్ పంపిణీ సంస్థలకు కాస్తంత ప్రయోజనకరంగా ఉందన్నారు. అలాగే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించి 25ఏళ్ళకు ఉండే ఎంఒయును కనీసం సగానికి తగ్గించాల్సిందిగా నియంత్రణ మండలి తరపున విద్యుత్ పంపిణీ సంస్థలకు సూచించామన్నారు. ఏకంగా 25 ఏళ్ళ వరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోవడం వలన సమస్యలు తలెత్తుతున్నందున 10నుంచి 12 ఏళ్ళపాటు ఇవి ఉండే విధంగా ఎంఒయు కుదుర్చుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఎపి విద్యుత్ నియంత్రణ మండలి నియమ, నిబంధనలకు సంబంధించి 27 అంశాలను అందరికీ అందుబాటులోకి ఉండే విధంగా తెలుగులోనే ముద్రించామన్నారు. ఇది త్వరలో అమల్లోకి రానుందన్నారు. రాష్ట్రంలో మూడుచోట్ల ఉన్న వినియోగదారుల విద్యుత్ సమస్యల పరిష్కార వేదికలకు (సిజిఆర్‌ఎఫ్) రిటైర్డ్ జడ్జిలను చైర్మన్లగా తొలిసారిగా నియమించామన్నారు. అలాగే వినియోగదారుల సమస్యల పరిష్కారానికి సంబంధించి ప్రత్యేకించి అధికారిని నియమించామన్నారు. ఎపి ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సిఇఓ చంద్రశేఖరరెడ్డి, ఇపిడిసిఎల్ చైర్మన్ కమ్ మేనేజింగ్ డైరెక్టర్ నాయక్, డైరెక్టర్లు బొడ్డు శేషుకుమార్, టివిఎస్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.

చిత్రం.. విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎపి విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ భవానీ ప్రసాద్