రాష్ట్రీయం

హోరెత్తిన కొత్త పోరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం జెట్ వేగంతో పరుగులు తీస్తుంటే, సర్కారు విధానం అశాస్ర్తియమంటూ జనంనుంచి పోరుబాట ఉద్ధృతమైంది. కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటు ప్రజాభిప్రాయం మేరకే జరుగుతుందని సాక్షాత్తూ సిఎం ప్రకటనలు గుప్పిస్తున్నా, ముసాయిదా ముంచేసేలా ఉందంటూ జనం భగ్గుమన్నారు. మంగళవారం అన్ని జిల్లాల్లోనూ ‘కొత్త’ పోరు ఒక్కసారిగా కాకెక్కింది. జనగామలో నిర్వహించిన జనగర్జనలో తెలంగాణ పొలిటికల్ జెఏసి చైర్మన్ కోదండరామ్ మాట్లాడుతూ సిఎంలు వస్తారు, పోతారు.. జిల్లాల ఏర్పాటనేది చట్టబద్ధంగా, శాస్ర్తియంగా ఉండాలని డిమాండ్ చేశారు. జనగామలో నిర్వహించిన గర్జనకు పెద్దఎత్తున విద్యార్థులు హాజరయ్యారు. ఇదిలావుంటే, సర్కారు తీరును ఎండగడుతూ కరీంనగర్, ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబ్‌నగర్, వరంగల్ జిల్లాల్లోనూ జనం రోడ్డెక్కారు. 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కోరుట్ల, సిరిసిల్లలో తొలిరోజు వ్యతిరేక నినాదాలు, ర్యాలీలు, రాస్తారోకోలతో వాతావరణం ఉద్రిక్తమైంది. కెసిఆర్, కెటిఆర్ దిష్టిబొమ్మలు, తెరాస జెండాలు దగ్ధం చేసి, ఆర్టీసీ బస్సులను పాక్షికంగా ధ్వంసం చేశారు. గద్వాల, నారాయణపేటను జిల్లాలుగా మార్చాలన్న ఆందోళనలూ ఊపందుకున్నాయ. కల్వకుర్తి రెవిన్యూ డివిజన్ కోసం దీక్షలు సాగుతుంటే, ములుగు, పరకాలలో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. హనుమకొండలో అఖిలపక్ష నేతలు పాదయాత్రలు నిర్వహించారు. భారీగా వర్షాలు కురుస్తున్నా.. కొత్త జిల్లాలపై జనాగ్రహంతో రాష్ట్రం మాత్రం వేడెక్కుతోంది.

చిత్రం.. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనగామలో నిర్వహించిన
జనగర్జనలో మాట్లాడుతున్న ప్రొఫెసర్ కోదండరామ్. పెద్ద ఎత్తున హాజరైన విద్యార్థులు, ప్రజలు.