రాష్ట్రీయం

త్వరలో బీసీలకూ కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20: ఎస్సీ ఎస్టీల తరహాలో బీసీల కోసం ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలని సిఎం కె చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. కమిషన్ ఏర్పాటుకు సంబంధించిన అధికార ప్రక్రియ వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బిసీల జీవన ప్రమాణాల్లో మార్పు తేవాల్సిన అవసరం ఉందని, వీటిపై కార్యాచరణ రూపొందించేందుకు త్వరలోనే బీసీ వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రముఖులతో విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం బీసీ సంక్షేమంపై సంబంధిత మంత్రి జోగురామన్న, సిఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డి తదితరులతో కెసిఆర్ సమావేశమయ్యారు. బీసీల సంక్షేమం పేరిట గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలు హాస్యాస్పదంగా, మొక్కుబడిగా ఉన్నాయని సిఎం అభిప్రాయపడ్డారు. బీసీ వర్గాల జీవన ప్రమాణాలు పెంచేందుకు అవసరమైన నిధులు వచ్చే బడ్జెట్‌లో కేటాయిస్తామని సిఎం వెల్లడించారు. బీసీల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకుల పాఠశాల ప్రారంభించడంతోపాటు, బీసీ స్టడీ సర్కిళ్లను పకడ్బంధీగా నిర్వహించడం అత్యంత ప్రాధాన్యతాంశంగా భావిస్తామన్నారు. బీసీ కులాలకు చెందిన భావితరాలకు మంచి భవిష్యత్ అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, వారికి మంచి చదువు, మంచి పునాది వేయాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో సగభాగమున్న బీసీల పురోగతి వారి పిల్లలకు మంచి విద్య అందించడం ద్వారా సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. బీసీ వర్గాల విద్య కోసం ఎంత ఖర్చయినా పెట్టేందుకు ప్రభుత్వం సిద్థంగా ఉందన్నారు. మొదటి దశలో రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున బీసీ గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలని సిఎం ఆదేశించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచే కొత్త గురుకుల పాఠశాలలు ప్రారంభం కావాలని, ఇందులో సగం బాలురకు, సగం బాలికలకు కేటాయించాలని సూచించారు. వచ్చే జూన్‌నాటికి గురుకుల పాఠశాలల బోధన, బోధనేతర సిబ్బంది నియామకం, విద్యార్థుల చేరిక, వారికి వసతి తదితర ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ గురుకుల విద్యాసంస్థల మాదిరిగానే బీసీ గురుకులాలకు ప్రణామాలు వర్తింప చేయాలని సూచించారు. బీసీ గురుకుల విద్యాసంస్థల పర్యవేక్షణకు నిబద్ధత కలిగిన అధికారిని నియమించాలని ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం బీసీ స్టడీ సర్కిళ్లు ఉన్నప్పటికీ అవీ మొక్కుబడిగా పని చేస్తున్నాయని, వాటిని గాడిలో పెట్టడంతోపాటు అకాడమీ తరహాలో నిర్వహించాలని సూచించారు. స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందిన వారికి తప్పనిసరిగా ఉద్యోగమిచ్చే విధంగా ఉండాలన్నారు. బీసీ హాస్టళ్ల పరిస్థితి, ఏర్పాటు చేయబోయే గురుకుల పాఠశాలలు, వాటికి వసతి సౌకర్యం తదితర అంశాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని కెసిఆర్ అధికారులను ఆదేశించారు.

చిత్రం.. బీసీ కమిషన్ ఏర్పాటుపై ఉన్నతఅధికారులతో చర్శిస్తున్న సిఎం కెసిఆర్