రాష్ట్రీయం

మేనేజ్‌మెంట్ కోటా భర్తీ విధానం చెప్పండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 20:ప్రైవేటు మేనేజ్‌మెంట్ కోటాలో లోకల్, నాన్ లోకల్ సీట్ల భర్తీకి అనుసరిస్తున్న విధానాలపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను హైదరాబాద్ హైకోర్టు మంగళవారం ఆదేశించింది. జస్టీస్ వి రామసుబ్రమణ్యం, జస్టీస్ ఆనీస్‌లు ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల మేనేజ్‌మెంట్ అసోసియేషన్ పిటీషన్‌ను విచారిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్టికల్ 371 డి ప్రకారం కోటా భర్తీ చేస్తున్నట్టు యాజమాన్యాల అసోసియేషన్ తెలిపింది. ఇదే సమస్యపై ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీపై హైకోర్టు ఇదే తరహా తీర్పు ఇచ్చినట్టు కోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. ప్రైవేటు మేనేజ్‌మెంట్ కోటా కింద సీట్లను ఏ రాష్ట్రం వారితోనైనా భర్తీ చేసే అధికారం మేనేజ్‌మెంట్‌కు ఉంటుందని ఆంధ్రప్రదేశ్ వాదించింది. దేశంలో ఏ రాష్ట్రానికి చెందిన వారితోనైనా భర్తీ చేయవచ్చునా? రెండు రాష్ట్రాలకు చెందిన వారితోనే భర్తీ చేయాలా?అనే అంశంపై అఫిడవిట్ దాఖలు చేయాలని రెండు రాష్ట్రాల సంబంధిత అధికారులను కోర్టు ఆదేశించింది.
అమరావతి స్విస్ చాలెంజ్‌పై నేడు వాదనలు
అమరావతి రాజధాని నిర్మాణంలో స్విస్ చాలెంజ్‌పై మంగళవారం కూడా వాదనలు కొనసాగాయి. బుధవారంకు తిరిగి వాదనలు కొనసాగుతాయి. అమరావతిలో ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైదరాబాద్ హైకోర్టుకు తెలిపింది. విదేశీ కంపెనీలను ఆకర్శించే విధంగా రాజధాని నిర్మాణం జరుగుతుందని అన్నారు.