ఆంధ్రప్రదేశ్‌

మూడు రోజులు భారీ వానలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 21: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కోస్తాను ఆనుకుని అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం బుధవారం రాత్రి ప్రకటించింది. దీనికి సమాంతరంగా 7.6 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది క్రమంగా తెలంగాణ ప్రాంతానికి విస్తరించనుంది. దీని ప్రభావంతో తెలంగాణ జిల్లాల్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. గడచిన 24 గంటల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షపాతం నమోదైంది.