రాష్ట్రీయం

‘కింగ్‌ఫిషర్’ మాజీ అధికారి రఘునాథన్‌కు 18 నెలల శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: చెక్ బౌన్స్ కేసులో కింగ్ ఫిషర్ పూర్వ ప్రధాన ఆర్ధిక శాఖాధికారి రఘునాథన్‌కు ఎర్రమంజిల్ ప్రత్యేక కోర్టు 18 నెలల జైలు శిక్షను విధిస్తూ తీర్పు ఇచ్చింది. అనంరం ఈ తీర్పుపై హైకోర్టుకు అపీల్‌కు వెళ్లేందుకు అవకాశం ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. జిఎంఆర్ సంస్ధకు ఇచ్చిన చెక్‌ల బౌన్సు కేసులో లండన్‌కు వెళ్లిపోయిన వాణిజ్యవేత్త విజయ్ మాల్యా, రఘునాథన్‌లపై కేసు నమోదైంది. ఈ కేసును ఎర్రమంజిల్ కోర్టు విచారించింది. ఈ కేసులో రఘునాథన్‌కు 18 నెలల జైలుశిక్షతో పాటు 20 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు రిజర్వులో ఉందని, నిందితులు కోర్టుకు హాజరైతే తీర్పు ఇస్తామని కోర్టు గతంలో పలుసార్లు ప్రకటించింది. కాగా రఘునాథన్ తాను యునైటెడ్ స్పిరిట్స్‌లో ఉద్యోగం చేస్తున్నానని, తన సేవలను కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్‌లో వినియోగించుకున్నారని కోర్టుకు తెలిపారు. తాను 2013లోనే పదవీ విరమణ చేసినట్లు ఆయన కోర్టుకుతెలిపారు.