రాష్ట్రీయం

కొత్త జిల్లాలు యథాతథం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: తెలంగాణలో జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాల పునర్విభజనపై తుది నోటిఫికేషన్ విడుదల చేయడానికి అధికారులు కసరత్తు చేస్తున్నారు. వీటి పునర్విభజనపై జారీ చేసిన ముసాయిదాపై ప్రజల నుంచి అభ్యంతరాలు, సూచనలు, సలహాలు స్వీకరించడానికి విధించిన గడువు 21న సాయంత్రం ముగిసిన విషయం తెలిసిందే. ఇక తుది నోటిఫికేషన్ విడుదల చేయడం ఒక్కటే తరువాయి. దీన్ని ఆమోదించడానికి ఈ నెల 26న మంత్రిమండలి ప్రత్యేకంగా సమావేశం కాబోతుంది. మంత్రివర్గం ఆమోదం పొందిన మరుసటి రోజునే(ఈనెల 27) తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. ముసాయిదాలో పేర్కొన్న కొత్త జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, మండలాలపై మొత్తంగా 100,607 వినతులు అందాయి. వీటిని క్రోడికరించి సహేతుకమైన అభ్యంతరాలపై మాత్రమే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడానికి భూ పరిపాలన కమిషనర్ కార్యాలయం కసరత్తు చేస్తున్నది. కొత్త జిల్లాలు ఎన్ని ఉండాలన్నది రాజకీయపరమైన నిర్ణయం మాత్రమే కావడంతో ముసాయిదాలో ప్రకటించిన మేరకు 17 కొత్త జిల్లాల సంఖ్యలో ఎటువంటి మార్పు ఉండకపోవచ్చని అధికార వర్గాల సమాచారం. అయితే ఒక్క వరంగల్ జిల్లా హన్మకొండ జిల్లా ఏర్పాటుపై అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల నుంచే అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దీనికి ప్రత్యామ్నాయంగా మరో పేరుతో వరంగల్ రూరల్ జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో ప్రముఖ పుణ్య క్షేత్రం యాదాద్రి పేరుతో ఇప్పటికే ఒక జిల్లా ఏర్పాటు చేయాలని నిర్ణయించడంతో భద్రకాళి పేరు కాకుండా కాకతీయుల కాలంలో ఈప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందడంతో వరంగల్ రూరల్ జిల్లాకు కాకతీయ జిల్లాగా నామకరణం చేస్తూ ముసాయిదాలో స్వల్ప మార్పులు చేస్తున్నట్టు సమాచారం. కొత్త జిల్లాలుగా ఏర్పాటు కోసం గద్వాల, జనగామ, సిరిసిల్లలలో జరుగుతున్న ఆందోళనలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదని తెలిసింది. ముసాయిదాలో ప్రకటించిన దానికంటే అదనంగా జిల్లాల సంఖ్య పెంచడానికి ముఖ్యమంత్రి ఏమాత్రం సుముఖంగా లేరని అధికార వర్గాల సమాచారం. అయితే కొత్త రెవిన్యూ డివిజన్లు, మండలాల సంఖ్య పెంచడానికి మాత్రం ముఖ్యమంత్రి సుముఖంగా ఉన్నట్టు ఈ వర్గాల సమాచారం. కొత్తగా 45 మండలాలు ఏర్పాటు చేయనున్నట్టు ముసాయిదాలో ప్రకటించింది. అయితే అదనంగా మరో 30 కొత్త మండలాలు ఏర్పాటుకు తుది నోటిఫికేషన్‌లో అవకాశం కల్పించాలని టాస్క్ఫోర్స్ కమిటీని సిఎం ఆదేశించినట్టు తెలిసింది.