రాష్ట్రీయం

ఆంధ్రాలో డిజిటల్ విప్లవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 22: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని రంగాల్లో సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని అవినీతి, అక్రమాలను , దళారీ వ్యవస్థను నివారించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోంది. పౌర సేవలు అన్నీ ఆన్‌లైన్‌లోనే అందిస్తోంది. మరో పక్క భూమి రికార్డులను డిజిటలైజ్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేస్తోంది. ఎవరి భూమి వారికే చెందేలా రాష్ట్రప్రభుత్వం మీ ఇంటికి మీ భూమి, ఈ పాస్ పుస్తకాల ప్రక్రియను ప్రారంభించింది. ఇది సత్ఫలితాలను ఇస్తోంది. రాష్టవ్య్రాప్తంగా మీ ఇంటికి- మీ భూమి కార్యక్రమం కింద 13 జిల్లాల్లోని భూమి ఓనర్లకు భూముల పట్టాలను అందిస్తోంది. ఆయా భూములను ఎవరి పేరుతో ఉన్నాయో పరిశీలించి, ఆ భూముల యజమానులకు భూపత్రాలను అందించనున్నారు. రాష్ట్రంలో ఇంత వరకూ 12,41,656 మందికి ఇంటికి వారి వారి భూమి పత్రాలను ప్రభుత్వం అందించింది. రాష్టవ్య్రాప్తంగా మీ ఇంటికి మీ భూమి పథకం కింద 13,71,455 దరఖాస్తులు అందుకున్న రెవిన్యూ శాఖ 1,29,799 దరఖాస్తులను వివిధ కారణాలతో తిరస్కరించింది. తూర్పుగోదావరి జిల్లాలో 1,36,794 దరఖాస్తులను ఆమోదించగా, విశాఖ జిల్లాలో 1,57,103 దరఖాస్తులను ఆమోదించారు. విజయనగరం జిల్లాలో 1,17,817 దరఖాస్తులను ఆమోదించగా, 25,861 దరఖాస్తులను తిరస్కరించారు. ఇక ఈ పాస్‌పుస్తకాలకు సంబంధించి ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త విధానం సత్ఫలితాలను ఇస్తోంది. ఈ పాస్ పుస్తకాల కోసం 13, 92,832 మంది దరఖాస్తు చేసుకోగా, 7,76,131 మంది దరఖాస్తులను పరిశీలించి ఆమోదించారు. 5,35,627 దరఖాస్తులు తిరస్కరించారు. వీటిలో సర్వీసు లెవెల్ అగ్రిమెంట్ వద్ద పెండింగ్‌లో ఉన్న అభ్యర్థనలు 54,716 ఎస్‌ఎల్‌ఎ పరిధికి మించి పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు 26,358 ఉన్నాయి. రాష్ట్రంలో పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇక మీదట ఈ పాస్ పుస్తకాల రూపంలో ఉంటాయి. భూమి రిజిస్ట్రేషన్ సమయంలోనే మ్యుటేషన్ చార్జీలు వసూలు చేస్తారు. అభ్యంతరాలు ఉంటే ఆధార్ ఆధారిత వేలిముద్రతో కూడిన డిజిటల్ సంతకంతో రెవిన్యూ రికార్డుల్లో మార్చి ఈ పాస్ బుక్‌ను జనరేట్ చేస్తారు. అపుడు ప్రత్యేక నెంబర్ సిద్ధమవుతుంది. ఈ పాస్‌పుస్తకంతో పాటు పాత పుస్తకం బదులు కొత్తది ఇచ్చేందుకు 135 రూపాయిలు వంతున వసూలు చేస్తారు.