రాష్ట్రీయం

బిసి యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 22: బిసిల్లో వేల మందిని యువ పారిశ్రామికవేత్తలుగా తయారుచేయటానికి 25 లక్షల రూపాయలతో చిన్న యూనిట్లను నెలకొల్పటానికి అవకాశం కల్పిస్తున్నట్లు బిసి సంక్షేమ మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. సంచార జాతులకు చెందిన 26 కులాలను ఒక గ్రూపుగా ఏర్పాటుచేసి వారికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయటానికి ముఖ్యమంత్రి కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజా సాధికార సర్వే పూర్తిచేసిన తరువాత ప్రతి ఒక్క కుటుంబానికి కూడా 10వేల రూపాయలు లబ్ధి అందే విధంగా కృషి చేయనున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. వెనుకబడిన తరగతుల సంక్షేమం, సాధికారత కోసం చేనేత మంత్రి కొల్లు రవీంద్ర గురువారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బిసి విద్యార్థుల కొరకు జాబ్‌మేలా వెబ్‌సైట్‌ను బిసి క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలకు అనుగుణంగా బిసి వెల్ఫేర్ జాబ్‌మేలా-2016 వెబ్‌సైట్‌ను బిసిల భాగస్వామ్యంతో ప్రారంభించటం జరిగిందన్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ వివిధ కంపెనీలు, స్టూడెంట్స్‌కు సంబంధించినవారు వెబ్‌సైట్‌లో తమ కంపెనీల అడ్రస్‌లను, తమకు కావాల్సిన మాన్‌పవర్‌ను నమోదు చేసుకోవాలన్నారు. అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగులు కూడా ఈ జాబ్‌మేలా వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఏయే కంపెనీల్లో తమకు అవకాశాలు ఉన్నాయో తెలుపుతూ పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. దీనికి సంబంధించిన బ్రోచర్స్ కూడా మంత్రి విడుదల చేయటం జరిగింది.ఇప్పటివరకు 1048 మంది బిసి విద్యార్థులు నమోదు చేసుకున్నట్లు చెప్పారు. బిసి వెబ్‌సైట్ పబ్లిక్ డొమైన్‌లో ఉంటుందని, విద్యార్థులు కూడా తమకు కావాల్సిన కంపెనీ సెలెక్ట్ చేసుకోవాలన్నారు. విద్యార్థులు వారి వివరాలు, కంపెనీలు ఆప్షన్‌ను వచ్చే 15 వరకు నమోదు చేసుకోవాలన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించటానికి జాబ్‌మేలాను తీసుకొచ్చినట్లు చెప్పారు. 13 కంపెనీల్లో 1048 ఖాళీలు ఉన్నట్లు తెలిపారు. వివిధ స్కిల్స్‌కి సంబంధించిన ట్రైనింగ్ ఇస్తామని చెప్పారు. వచ్చేనెల 15న రాజమండ్రిలో జాబ్‌మేలా నిర్వహించి అక్కడ కంపెనీలకు నమోదు చేసుకున్న విద్యార్థుల వివరాలు ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బిసిలకు సబ్‌ప్లాన్‌లో 8842 కోట్లు కేటాయించారన్నారు. ఎన్టీఆర్ విదేశీ విధానం ద్వారా ప్రతి సంవత్సరం వెయ్యి మందిని విదేశాలకు పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ సంవత్సరం ఇప్పటివరకు 78 మందిని ఈ పథకం ద్వారా ఎంపిక చేశామని చెప్పారు. సివిల్ సర్వీసెస్ కోచింగ్ కోసం 750 మందికి ఒక్కొక్కరికి రెండు లక్షలతో కోచింగ్ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. 650 మందికి వివిధ బ్యాంక్ ఎగ్జామ్స్ కోసం కోచింగ్‌కు ఎంపిక చేశామని, అదే విధంగా కానిస్టేబుల్స్ కోచింగ్, వివిధ గ్రూప్స్ కోసం కోచింగ్ ఇప్పిస్తామన్నారు. బిసిల ఫీ-రీయింబర్స్‌మెంట్ కోసం ప్రతి సంవత్సరం 1600 కోట్లు ప్రభుత్వం ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవతో ఆరు కార్పొరేషన్లకు సంబంధించి చైర్మన్‌ల నియామకం జరిగిందన్నారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్‌లు ద్వారా లబ్దిదారులకు వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా అందిస్తున్నట్లు చెప్పారు.